Eggs Side Effects: కోడిగుడ్డు తిన్నాక ఈ 4 ఆహారాలను అస్సలు తినకండి.. మీ ఆరోగ్యానికే హానికరం!!
ఆరోగ్యంగా ఉండేందుకు.. పెరిగిన బరువును తగ్గించుకునేందుకు నేటి కాలంలో చాలా మంది డైట్ ను పాటిస్తున్నారు. అందులో భాగంగా ప్రొటీన్ కోసం కోడి గుడ్లను తీసుకుంటూ ఉంటారు. కోడిగుడ్లు తిన్న తర్వాత కొన్ని ఆహారాలను తినకూడదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. కడుపులో వాటి కలయిక వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రొటీన్లు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండే కోడిగుడ్లలో.. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కోడి గుడ్లను డైట్ లోనే కాదు..

ఆరోగ్యంగా ఉండేందుకు.. పెరిగిన బరువును తగ్గించుకునేందుకు నేటి కాలంలో చాలా మంది డైట్ ను పాటిస్తున్నారు. అందులో భాగంగా ప్రొటీన్ కోసం కోడి గుడ్లను తీసుకుంటూ ఉంటారు. కోడిగుడ్లు తిన్న తర్వాత కొన్ని ఆహారాలను తినకూడదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. కడుపులో వాటి కలయిక వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రొటీన్లు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండే కోడిగుడ్లలో.. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కోడి గుడ్లను డైట్ లోనే కాదు.. రకరకాల వంటలు చేసుకునేందుకు కూడా ఉపయోగిస్తాం. కోడిగుడ్లు తిన్న వెంటనే 4 రకాల ఆహారాలను తినకూడదట. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా.
పన్నీర్: చాలా మంది పన్నీర్ – కోడిగుడ్లను కలిపి లేదా మిక్స్ చేసి తింటుంటారు. ఈ రెండింటినీ కలిపి తింటే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ కాంబినేషన్ వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల కడుపునొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ వంటివి కలుగుతాయి.
నిమ్మకాయ: కొందరు గుడ్డు రుచిగా తినాలని నిమ్మకాయను కలిపి తింటారు. కానీ.. గుడ్డు, నిమ్మకాయ కలిపి తింటే దానికి ప్రతిచర్య ఉంటుంది. ఈ కాంబినేషన్ వల్ల శరీరంలో దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
చేపలు: చేపలు తిన్న తర్వాత గుడ్డు తినొచ్చా? తినకూడదా ? అనేది చాలా మందికి ఉండే ప్రశ్న. గుడ్లు, చేపలను కలిపి తినడం లేదా.. ఒకదాని తర్వాత ఒకటి తింటే.. శరీరంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రొటీన్ అలెర్జీలకు కారణం కావొచ్చు. గుడ్డు, చేప కాంబినేషన్లను తినే ముందు ఈ విషయాలను తెలుసుకోవాలి.
ఫ్రూట్స్: బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు తిన్నాక ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది. వాటిలో అరటిపండ్లు తినకూడదు. ఇవి రెండూ కలిసి కడుపులో జీవక్రియను నిదానంగా చేస్తాయి. ఫలితంగా మలబద్ధకం, గ్యాస్, ప్రేగు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




