Fruits and Diabetes: డయాబెటిక్స్ ఈ పండ్లను తింటున్నట్లయితే.. తప్పక తెలుసుకోవలసిన విషయాలివే..
మన ఆరోగ్యాన్ని కాపాడడంలో పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకు పండ్లలో ఉండే అనేక రకాల పోషకాలే ప్రధాన కారణమని చెప్పుకోవాలి. పండ్లలో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు వంటి పోషకాలు..
మన ఆరోగ్యాన్ని కాపాడడంలో పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకు పండ్లలో ఉండే అనేక రకాల పోషకాలే ప్రధాన కారణమని చెప్పుకోవాలి. మనకు ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందించే పండ్లలో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు వంటి పోషకాలు ఉంటాయి. అంతేకాక పండ్లలో సహజ చక్కెర ఉంటుంది. దీని కారణంగా చాలా మంది పండ్లను తినడానికి భయపడుతుంటారు. పండ్లను తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయోమేననే భయం షుగర్ పేషెంట్లకు అనునిత్యం ఉండేదే. అందుకే డయాబెటీస్‌తో బాధపడేవారు పండ్లను తినేందుకు జంకుతుంటారు. వాస్తవానికి పండ్లలోని తీపి పదార్థం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే కొన్ని పండ్లలో మాత్రం షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయని, షుగర్ పేషెంట్లు వాటిని అస్సలు తినొద్దని చెబుతున్నారు. మరి ఏ పండ్లలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి..? ఏ పండ్లలో షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ద్రాక్ష: ఒక కప్పు ద్రాక్ష పండ్లలో 23 గ్రాముల చక్కెర ఉంటుంది. సాధారణ పరిమాణంలో వీటిని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ద్రాక్షా పండ్లను జ్యూస్, షేక్స్, వోట్ మీల్ ద్వారా తినవచ్చు.
అరటి: అరటి పళ్లలో శక్తి సమృద్ధిగా ఉంటుంది. మీడియం సైజు అరటిలో 14 గ్రాముల చక్కెర ఉంటుంది. మీరు ఉదయం అల్పాహారంలో ఈ అరటి పండును తినవచ్చు.
పియర్: ఒక పియర్‌లో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. మీరు తక్కువ పరిమాణంలో తినాలనుకుంటే మొత్తం పండు కి బదులుగా.. కొన్ని ముక్కలు కట్ చేసుకుని తినొచ్చు. పియర్‌ను పెరుగు, సలాడ్‌లో వేసుకుని తినవచ్చు.
పుచ్చకాయ: ఒక మీడియం సైజ్ పుచ్చకాయలో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. ఈ పుచ్చకాయలో అధిక శాతం నీరు, ఎలక్ట్రోలైట్ ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని రీఛార్జ్ చేయడానికి సహాయపడతాయి. ఒకేసారి రెండు పుచ్చకాయ ముక్కలుతినవచ్చు..
అవకాడో: ఒక అవోకాడోలో 1.33 గ్రాముల చక్కెర ఉంటుంది. మీరు దీనిని సలాడ్లు, టోస్ట్‌లలో కలిపి తినొచ్చు. ఈ పండ్లలో షుగర్ లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ అధిక కేలరీలు ఉంటాయి.
మామిడి: మామిడి పళ్లంటే దాదాపు అందరూ అమితంగా ఇష్టపుతారు. మీడియం సైజు మామిడి పండులో 45 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒకవేళ మీరు బరువు తగ్గాలనుకుంటే.. ఎక్కువగా మామిడి పండ్లను తినడం మానుకోవడం ఉత్తమం. ఒక రోజులో ఒకటి నుంచి రెండు మామిడి పండ్ల ముక్కలు తినొచ్చు.
చెర్రీస్: ఒక కప్పు చెర్రీస్‌లో 18 గ్రాముల చక్కెర ఉంటుంది. తద్వారా మీరు తిన్న పండ్లు తిన్నారో.. ఎంత షుగర్ ఆ పండ్లలో ఉంటుందో ఈజీగా అంచనా వేయొచ్చు. చెర్రీస్‌ను మితంగా తింటే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం