డయాబెటిక్ పేషెంట్లకు అలర్ట్.. మీ కళ్లలో ఇలాంటి సమస్యలుంటే ప్రమాదంలో పడుతున్నట్లే..

మధుమేహం అనేది శరీరంలోని దాదాపు ప్రతి భాగాన్ని ప్రభావితం చేసే వ్యాధి. డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవెల్ అదుపులో లేకుంటే అంధత్వానికి కూడా కారణం కావచ్చు. ముందుగా రెటినాను దెబ్బతిసే.. క్రమంగా కంటి ఆరోగ్యంపై ప్రభావితం చూపుతుంది. మధుమేహం కళ్లను ఎలా దెబ్బతీస్తుంది..? నిపుణులు ఏం చెబుతున్నారు.. ఈ వివరాలను తెలుసుకుందాం.

డయాబెటిక్ పేషెంట్లకు అలర్ట్.. మీ కళ్లలో ఇలాంటి సమస్యలుంటే ప్రమాదంలో పడుతున్నట్లే..
Diabetes Symptoms
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 02, 2025 | 9:19 AM

మధుమేహం అంటువ్యాధి కాని వ్యాధి.. అంటే, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.. కానీ భారతదేశంలో దాని కేసులు పెరుగుతున్న తీరు చాలా ఆందోళన కలిగిస్తుంది. దేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారని ICMR గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది.. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే దానికి మందు లేదు. కానీ, ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. మధుమేహం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించకపోతే, అది శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది అవయవాలను ప్రభావితం చేస్తుంది.. కంటి ఆరోగ్యానికి కూడా నష్టం.. ఒక్కోసారి అంధత్వానికి కూడా కారణమవుతుంది.

డయాబెటిక్ రోగులలో రక్తంలో అధిక చక్కెర మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. చక్కెర స్థాయి పెరగడం వల్ల శరీరంలో రక్త సరఫరా దెబ్బతింటుంది. దీని కారణంగా, రెటీనా, నరాలు కూడా ప్రభావితమవుతాయి. చక్కెర స్థాయి చాలా కాలం పాటు పెరిగితే… రెటీనా పై ప్రభావం చూపుతుంది.. దీని ప్రభావంతో రెటినా బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. క్రమంగా అది బలహీనం నుంచి ప్రమాదకరంగా మారవచ్చు.. ఒక్కసారి రెటీనా దెబ్బతింటే అంధత్వం వస్తుంది.

ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎవరికి ఉంది?..

50 ఏళ్ల తర్వాత ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సర్ గంగారాం ఆసుపత్రిలో కంటి విభాగం మాజీ హెచ్‌ఓడీ డాక్టర్ ఎకె గ్రోవర్ చెప్పారు. ఈ సమస్య టైప్-1, టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు రావచ్చు. దీని లక్షణాలు ప్రారంభంలో స్వల్పంగా ఉన్నప్పటికీ, సులువుగా గుర్తించవచ్చు.. కానీ కళ్ళజోడు దుకాణాల్లో చేసే కంటి తనిఖీలో ఈ వ్యాధిని గుర్తించలేదు. దీన్ని తనిఖీ చేయడానికి.. మీరు మీ కళ్ళను డాక్టర్ తో పరీక్షించుకోవడం అవసరం. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే.. ఈ లక్షణాలు కనిపిస్తే, వాటిని విస్మరించవద్దని కూడా గుర్తుంచుకోండి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు

అస్పష్టమైన దృష్టి

నిరంతర కంటి నొప్పి

కళ్ళు చుట్టూ వాపు

కళ్లలో మచ్చలు (చిన్న నల్లటి మచ్చలు).

క్షీణించిన లేదా అస్పష్టమైన రంగులు

కంటి నుండి నిరంతరం నీరు – చికాకు

చదవడంలో ఇబ్బంది

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..