AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Sugar Chart: ఏ వయసులో ఎంత షుగర్ లెవెల్ ఉండాలో తెలుసా.. ఈ చార్ట్ చూడండి.. పెరిగితే ఇలా కంట్రోల్ చేసుకోండి

ప్రతి వయస్సులో చక్కెర స్థాయి మారుతూ ఉంటుంది. ఈ స్థాయి సూచించిన మొత్తం కంటే కొంచెం ఎక్కువగా లేదా అంతకంటే తక్కువగా ఉంటే.. దానిని ప్రమాద సంకేతంగా పరిగణించండి.అయితే, మీ వయస్సు ఆధారంగా సరైన షుగర్ లెవల్‌ ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Blood Sugar Chart: ఏ వయసులో ఎంత షుగర్ లెవెల్ ఉండాలో తెలుసా.. ఈ చార్ట్ చూడండి.. పెరిగితే ఇలా కంట్రోల్ చేసుకోండి
Blood Sugar Chart
Sanjay Kasula
|

Updated on: Dec 29, 2022 | 12:40 PM

Share

నేటి కాలంలో వచ్చే వ్యాధులకు వయసుతో సంబంధం ఉండటం లేదు. ఎందుకంటే ఈ అన్ని వయసులవారి ఆరోగ్యంలోకి మధుమేహం తొంగి చూస్తోంది. ఇలాంటి సమయంలో మీ గురించి మీకు.. అంటే మీ ఆరోగ్యంపై మీకు పూర్తి అవగాహన, శ్రద్ధ ఉండాల్సిన అవసరం ఉంది. మీ శరీరంలో సకాలంలో జరుగుతున్న మార్పులను మీరు గమనించినట్లయితే.. వ్యాధులు రాకముందే వాటి నుంచి జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. ఇలాంటి వాటిపై నిర్లక్ష్యం ఉండటం వల్ల మధుమేహ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

దీని బాధితులలో వృద్ధులే కాదు చిన్నారులు కూడా ఉంటున్నారు. ఇందులో ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవడం అవసరం అవుతుంది. మరి ఏ వయసులో బ్లడ్ షుగర్ లెవెల్ ఉండాలనేది షుగర్ లెవెల్ చార్ట్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.

వయస్సు ప్రకారం చక్కెర స్థాయి ఇలా..

ప్రతి వయస్సులో చక్కెర స్థాయి మారుతూ ఉంటుంది. దీని కారణంగా, నిర్దేశించిన స్థాయి కంటే ఎక్కువ లేదా అంతకంటే తక్కువ ఉంటే ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి ఏ వయస్సులో చక్కెర స్థాయి సరైనదో తెలుసుకోండి..

  1. 0-5 సంవత్సరాల పిల్లలలో దీని ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. వారి చక్కెర స్థాయి 110 నుంచి 200 mg/dL వరకు ఉంటుంది
  2. 6-12 సంవత్సరాల వయస్సు పిల్లలకు 100 నుంచి 180 mg/dL వరకు చక్కెర స్థాయి ఉండాలి
  3. 13-18 సంవత్సరాల మధ్య అంటే టీనేజ్ రక్తంలో చక్కెర 90 నుంచి 150 mg/dL ఉంటే మంచిది
  4. 18 ఏళ్ల యువతలో, తిన్న తర్వాత, చక్కెర స్థాయి 140 mg/dL, కానీ అది ఖాళీ కడుపుతో 99 mg/dL వరకు ఉంటే అది సరైనది.
  5. మధుమేహం వచ్చే ప్రమాదం 40 ఏళ్ల తర్వాత ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, చక్కెర స్థాయి ఖాళీ కడుపుతో 90 నుంచి 130 mg/dL, తిన్న తర్వాత 140 నుంచి 150 mg/dL వరకు ఉంటుంది.

షుగర్ పెరిగితే ఎలా నియంత్రించాలి..

ఈరోజు తిండి, పానీయాలు స్వచ్ఛంగా లేని గాలి, అలాంటి పరిస్థితుల్లో షుగర్ లెవెల్ పెరగడం సర్వసాధారణమైపోయింది. అటువంటి పరిస్థితిలో మీ చక్కెర స్థాయి కూడా సూచించిన మొత్తం కంటే ఎక్కువగా ఉంటే.. అది కొన్ని మార్గాల్లో నియంత్రించబడుతుంది. అన్నింటిలో మొదటిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. నడవడం ప్రారంభించండి. వెంటనే స్వీట్లు లేదా స్టార్చ్ లేదా కార్బోహైడ్రేట్లు ఉన్న వస్తువులను తినడం మానేయండి. వీలైనంత వరకు మీ ఆహారంలో సలాడ్‌ను చేర్చండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం