AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer awareness: ఇప్పుడు రోబోటిక్‌ సర్జరీతో క్యాన్సర్‌ చికిత్స మరింత సులువు.. వదంతులకు చెక్‌ పెట్టండి..

గత కొన్నేళ్లుగా రోబోటిక్‌ సర్జరీల పరిధి విసృతమవుతోంది. క్యాన్సర్‌తో సహా వివిధ వ్యాధుల చికిత్సలో భాగంగా మినిమల్ ఇన్వాసివ్ సర్జరీలను ఉపయోగిస్తున్నారు. దాదాపు అన్ని రకాల క్యాన్సర్లను ఇప్పుడు రోబోటిక్ సర్జరీతో నయం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..

Cancer awareness: ఇప్పుడు రోబోటిక్‌ సర్జరీతో క్యాన్సర్‌ చికిత్స మరింత సులువు.. వదంతులకు చెక్‌ పెట్టండి..
Robotic Surgery
Srilakshmi C
|

Updated on: Jun 30, 2022 | 10:03 PM

Share

Robotic Surgery for Cancer: మన దేశ ప్రజల్లో ప్రతి 9 మందిలో ఒకరు (0 నుంచి 74 ఏళ్ల జీవితకాలంలో) క్యాన్సర్ బారీన పడుతున్నట్లు అధ్యయనాలు తెల్పుతున్నాయి. అత్యాధునిక చికిత్స పద్ధతులతో క్యాన్సర్ ను తరిగికొట్టడం ఇప్పుడు మరింత సులువుగా మారింది. గత కొన్నేళ్లుగా రోబోటిక్‌ సర్జరీల పరిధి విసృతమవుతోంది. క్యాన్సర్‌తో సహా వివిధ వ్యాధుల చికిత్సలో భాగంగా మినిమల్ ఇన్వాసివ్ సర్జరీలను ఉపయోగిస్తున్నారు. దాదాపు అన్ని రకాల క్యాన్సర్లను ఇప్పుడు రోబోటిక్ సర్జరీతో నయం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

రోబోటిక్ సర్జరీలు ఎందుకు?

యూరాలజీ, రోబోటిక్ సర్జరీ, ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా అనిల్‌ మంధానీ ఏంచెబుతున్నారంటే.. యూరాలజీతో సంబంధం ఉన్న దాదాపు అన్ని క్యాన్సర్లకు ఇప్పుడు రోబోటిక్ సర్జరీతో చికిత్స చేయవచ్చు. చాలా మంది రోగులకు తెలియని విషయం ఏమిటంటే.. ఓపెన్‌ సర్జరీలు అవసరమైన అన్ని సందర్భాల్లో రోబోటిక్ సర్జరీ ద్వారా చేయవచ్చు. కాకపోతే ఒకే ఒక్క తేడా ఉంటుంది. అదేంటంటే సర్జరీకి సంబంధించిన అన్ని విషయాలను డాక్టర్‌ చేత ప్రొగ్రామ్‌ చేయబడిన తర్వాత సర్జరీ జరుగుతుంది. ఐతే క్యాన్సర్ రోబోటిక్ సర్జరీలకు కొన్ని మినహాయింపులుంటాయి. క్యాన్సర్‌ పేషెంట్లకు చేసే రోబోటిక్ సర్జరీ చాలా ఖరీదైనది. రొమ్ము క్యాన్సర్‌ను నయం చేయడంలో రోబోటిక్ సర్జరీ వల్ల కొంత అదనపు ప్రయోజనం చేకూరుతుంది. ఎలాగంటే ఈ క్యాన్సర్ కణాలు ఉపరితలంపై ఉంటాయి. అందువల్ల వీటిని సులువుగా తొలగించవచ్చు.

ఇవి కూడా చదవండి

నోరు, కడుపు, రొమ్ము క్యాన్సర్లకు రోబోటిక్ సర్జరీతో చికిత్స చేయవచ్చు. ఈ విధమైన క్యాన్సర్ ఉన్న వ్యక్తుల్లో క్యాన్సర్ కణాలు చాలా లోతుగా అభివృద్ధి చెంది ఉంటాయి. వీటిని తొలగించడం కష్టం. ఇటువంటి సందర్భాల్లో రోబోటిక్‌ సర్జరీ ఎంతో ఉపయోగపడుతుంది. రోబోట్‌ మరింత లోతుల్లోకెళ్లి కణాలను పూర్తిగా తొలగించగలదని డాక్టర్ మంధాని పేర్కొన్నారు.

రోబోటిక్ సర్జరీ అందరికీ అవసరమా?

రోబోటిక్ సర్జరీ ఖరీదైనది. అందరికీ అవసరం లేదు. ఐతే ప్రోస్టేట్, మూత్రపిండాలు (కిడ్నీ), గర్భాశయం (uterus), అండాశయాలు (ovaries), పెద్ద ప్రేగు, అన్నవాహిక, లింప్‌ నోడ్స్‌.. వంటి క్యాన్సర్ రోగులకు ఈ విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇటువంటి సర్జరీలకు ఫోర్త్‌ జనరేషన్‌ రోబోటిక్స్ – డా విన్సీ సర్జికల్ సిస్టమ్‌లను ఉపయోగిస్తారు. ప్రోస్టేట్ తొలగించడానికి ల్యాప్రోస్కోపిక్ చేయడం కష్టం. పెల్వీస్‌ భాగంలో లోతుగా ఉండే చోట ప్రొస్టేట్ క్యాన్సర్‌ కణుతులు ఉంటాయి. డా విన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్‌తో ప్రొస్టేట్ క్యాన్సర్‌ (prostatectomies)కు చికిత్స సులభతరం అవుతుంది. నేటి కాలంలో దాదాపు అన్ని శస్త్రచికిత్సలు రోబోటిక్ సహాయంతో చేయగలుగుతున్నారని డాక్టర్ మంధాని తెలిపారు.

రోబోటిక్ సర్జరీ అంటే ఏమిటి?

రోబోటిక్ సర్జరీ అనేది లాపరోస్కోపిక్ సర్జరీ వంటిది. డాక్టర్ల ఆపరేషన్‌ పరికరాలు సంక్లిష్టమైన చోటుకు వెళ్లలేని పరిస్థితుల్లో రోబోటిక్‌ సులువుగా వెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఈ విధమైన సంక్లిష్టమైన ప్రక్రియలను నిర్వహించడానికి రోబోటిక్‌ సర్జరీలు ఉపయోగపడతాయని డాక్టర్ మంధాని అన్నారు.