Winter Skincare Tips: శీతాకాలంలో పొడి చర్మం ఉన్నవారు చేయాల్సిన, చేయకూడని పనుల ఏమిటంటే..

Winter Skincare Tips: సాధారణ, పొడి, జిడ్డు, సున్నితమైన, కంబైన్డ్ స్కిన్ ఇలా చర్మాన్ని ఐదు రకాలుగా విభజించారు. అయితే చర్మానికి తగిన సంరక్షణ అవసరం...

Winter Skincare Tips: శీతాకాలంలో పొడి చర్మం ఉన్నవారు చేయాల్సిన, చేయకూడని పనుల ఏమిటంటే..
Winter Skincare Tips
Follow us
Surya Kala

|

Updated on: Oct 30, 2021 | 1:02 PM

Winter Skincare Tips: సాధారణ, పొడి, జిడ్డు, సున్నితమైన, కంబైన్డ్ స్కిన్ ఇలా చర్మాన్ని ఐదు రకాలుగా విభజించారు. అయితే చర్మానికి తగిన సంరక్షణ అవసరం.. లేదంటే చర్మం మృధుత్వాన్ని కోల్పోతుంది. కొన్ని కొన్ని సార్లు చర్మ వ్యాధుల బారిన కూడా పడతారు. ముఖ్యంగా చర్మం గురించి కేరింగ్ తీసుకోవాల్సిన సీజన్ శీతాకాలం. ఈ సీజన్ ఎక్కువగా చర్మంపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు శీతాకాలంలో  పొడి చర్మం ఉన్నవారు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..

పొడి చర్మంగలవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

చర్మం పొడిబారకుండా: రోజంతా మీ శరీరం సున్నితంగా మృదువుగా ఉంచడానికి రోజూ తగినంత నీరుని తాగాలి.  చర్మం  పొడిబారితే.. స్కిన్ పొరలుగా కనిపిస్తుంది,  పగుళ్లు ఏర్పడతాయి. కనుక చర్మం తేమగా ఉంటే చర్మం మృదువుగా ఉంటుంది. కనుక తగిన నీటిని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.

నూనె, మాయిశ్చరైజర్లు: పొడి చర్మ తీరుకు సరిపడే మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. రెగ్యులర్ మాయిశ్చరైజర్‌ను ఉపయోగిస్తే శీతాకాలంలో చర్మానికి వచ్చే ఇబ్బందులను అరికడుతుంది. అంతేకాదు చర్మం తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.

సీజన్‌కు అనుగుణంగా మీ చర్మ సంరక్షణ: సీజన్‌లలో మార్పుకు అనుగుణంగా చర్మ సంరక్షణలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. స్కిన్ తీరుకు వాతావరణనైకి అనుగుణంగా తీసుకునే చర్యలతో సీజన్ మొత్తం చర్మం మృదువుగా సున్నితంగా మెరుస్తూ ఉంటుంది.

పొడి చర్మం వారు శీతాకాలంలో చేయకూడని పనులు: 

చర్మాన్ని మృదువుగా మర్దన చేయడం వలన  చర్మ కణాలు, మలినాలు పోయి.. స్కిన్ లోని రంధ్రాలు తెరుచుకుంటాయి. అయితే చర్మంపై పొలుసు అధికంగా ఉంటే.. చర్మం పొడిబారి ఇబ్బందికి గురవుతారు. చర్మం ఎరుపుగా మారుతుంది. కొన్ని కొన్ని సార్లు మంట కూడా వచ్చి చికాకు కూడా వస్తుంది.

పొడి చర్మం గలవారు ఆల్కహాల్‌ ఉత్పత్తులకు దూరంగా ఉండడం మంచిది.  చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకునే ముందు వాటిని ఒక్కసారి పరిశీలించి తీసుకోవాలి. ఎందుకంటే టోనర్‌లు,  క్లెన్సర్‌లు వంటి వివిధ రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఆల్కహాల్ ఉండవచ్చు. అటువంటి ఉత్పత్తులను చర్మానికి అప్లై చేస్తే.. మరింత పొడిబారి..ఇబ్బంది అధికమవుతుంది. శీతాకాలం అంటే ఎక్కువ మంది వేడి నీరుని స్నానం చేయడానికి ఇష్టపడతారు. అయితే పొడి చర్మం వారు అధిక వేడి నీటికి దూరంగా ఉండడం మంచిది. పొడి చర్మంవారు ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే.. చర్మం పొడిబారుతుంది. ఒకొక్కసారి చర్మ సంబంధ వ్యాధులు తామర వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

Also Read: కరోనా కష్టాలు.. ఇంటి యజమాని వేధింపులకు హాస్టల్ ఓనర్ బలి.. రెంట్ కట్టలేక ఆత్మహత్య

తెల్లారేసరికి కాలేజీ ఆవరణలో భయంకర సీన్.. అమ్మాయిలు చూడగా..
తెల్లారేసరికి కాలేజీ ఆవరణలో భయంకర సీన్.. అమ్మాయిలు చూడగా..
ఇంటి వరండాలో వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా
ఇంటి వరండాలో వినిపించిన వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా
ఆ దేశంలో శృంగార మంత్రిత్వశాఖ ఏర్పాటు.. ఎందుకో తెలుసా?
ఆ దేశంలో శృంగార మంత్రిత్వశాఖ ఏర్పాటు.. ఎందుకో తెలుసా?
యుద్ధం చెయ్యమని పంపిస్తే.. నీలి చిత్రాలు చూస్తున్నారు.! వీడియో
యుద్ధం చెయ్యమని పంపిస్తే.. నీలి చిత్రాలు చూస్తున్నారు.! వీడియో
ముంచుకొస్తున్న మరో గండం.! రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం.
ముంచుకొస్తున్న మరో గండం.! రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం.
బియ్యం కడిగిన నీళ్లే కదా అని చీప్‌గా చూడకండి.! వీటితో ఎన్నో ఉపయోగ
బియ్యం కడిగిన నీళ్లే కదా అని చీప్‌గా చూడకండి.! వీటితో ఎన్నో ఉపయోగ
వామ్మో.. కట్టలు కట్టలుగా పాములు ఒకేసారి.! విశాఖ సిటీ షేక్..
వామ్మో.. కట్టలు కట్టలుగా పాములు ఒకేసారి.! విశాఖ సిటీ షేక్..
ఊహించని విధంగా హరితేజ ఎలిమినేట్. కానీ రెమ్యునరేషన్‌ అన్ని లక్షలా?
ఊహించని విధంగా హరితేజ ఎలిమినేట్. కానీ రెమ్యునరేషన్‌ అన్ని లక్షలా?
చావు కళ్ల ముందే స్పష్టంగా కనిపించింది..!
చావు కళ్ల ముందే స్పష్టంగా కనిపించింది..!
నేను పెళ్లి చేసుకోవాలా.? వద్దా.? ఆయన వల్లే పెళ్లి చేసుకోలేదా.?
నేను పెళ్లి చేసుకోవాలా.? వద్దా.? ఆయన వల్లే పెళ్లి చేసుకోలేదా.?