Breast Cancer Vaccine: రొమ్ము క్యాన్సర్ నివారణ కోసం వ్యాక్సిన్ సిద్ధం.. అమెరికాలో మొదటి దశ ట్రయల్స్ ప్రారంభం!
ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ ఇబ్బందిని కలిగించే బ్రెస్ట్ క్యాన్సర్ పై పోరాటాన్ని వైద్య శాస్త్రవేత్తలు ఉధృతం చేశారు. ఇందులో భాగంగా రొమ్ము క్యాన్సర్ ను నివారించే టీకాను కనిపెట్టారు.
Breast Cancer Vaccine: ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ ఇబ్బందిని కలిగించే బ్రెస్ట్ క్యాన్సర్ పై పోరాటాన్ని వైద్య శాస్త్రవేత్తలు ఉధృతం చేశారు. ఇందులో భాగంగా రొమ్ము క్యాన్సర్ ను నివారించే టీకాను కనిపెట్టారు. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి, అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ తన వ్యాక్సిన్ మొదటి దశ ట్రయల్‌ను ప్రారంభించింది. ఈ ట్రయల్ సహాయంతో, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్‌ను నియంత్రించవచ్చు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి వ్యాక్సిన్ ట్రయల్ కోసం ఆమోదం పొందిన తర్వాత క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ వ్యాక్సిన్ కంపెనీ అనిక్సా బయోసైన్స్‌తో కలిసి పని చేస్తోంది. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ చాలా ముఖ్యమైనవిగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకో తెలుసుకుందాం.
ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ ఎందుకు అవసరం?
కొత్త వ్యాక్సిన్‌కు రొమ్ము క్యాన్సర్‌ను నివారించే సామర్థ్యం ఉందని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ లెర్నర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని ఇమ్యునాలజిస్ట్, వ్యాక్సిన్ డెవలపర్ విన్సెంట్ తుయోఫీ చెప్పారు. రొమ్ము క్యాన్సర్ నిర్ధారించిన ప్రతి 100 కేసుల్లో 12 నుండి 15 మంది ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ రోగులు. ఇది రొమ్ము క్యాన్సర్‌లో అత్యంత తీవ్రమైన రకం. ఆఫ్రికన్, అమెరికన్ మహిళల్లో దీని కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది.
ఈ మొదటి హ్యూమన్ ట్రయల్స్ లో ఏమి జరుగుతుంది?
ఈ ట్రయల్స్ కంటే ముందు, ఈ వ్యాక్సిన్ ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్న 18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల రోగులకు ఇచ్చారు. ఈ రోగులలో కణితులు పూర్తిగా కరిగిపోయినట్టు తేలింది. ప్రస్తుతం వారిలో మళ్లీ ట్యూమర్ వచ్చే ప్రమాదాన్ని అర్థం చేసుకునేందుకు మానిటరింగ్ చేస్తున్నారు.
ట్రయల్ మొదటి దశలో, ఈ వ్యాక్సిన్ ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రారంభ రోగులకు ఇస్తారు. క్యాన్సర్‌తో పోరాడాలంటే వారి శరీరంలో రోగ నిరోధక శక్తి ఎంతగా కనిపిస్తుందో దీనిద్వారా అర్థమవుతుంది.
మొదటి దశ ట్రయల్‌లో పాల్గొన్న రోగులకు మూడు డోసుల వ్యాక్సిన్‌ను ఇస్తారు. టీకా ప్రభావం, దుష్ప్రభావాలను 2 వారాల పాటు పర్యవేక్షిస్తారు. ఈ మొత్తం ట్రయల్స్ సెప్టెంబర్ 2022 నాటికి పూర్తవుతాయి.
వ్యాక్సిన్ ప్రీ-క్లినికల్ ట్రయల్‌లో ఏం జరిగింది..
వ్యాక్సిన్‌కి సంబంధించిన ప్రీ-క్లినికల్ ట్రయల్ ఎలుకలపై జరిగింది. ఈ వ్యాక్సిన్ రోగనిరోధక వ్యవస్థను సక్రియం చేసి బ్రెస్ట్ క్యాన్సర్ ట్యూమర్‌లను నివారించడంలో విజయవంతమైందని విచారణలో వెల్లడైంది. నేచర్ మెడిసిన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, ఈ టీకా ఇతర కణితులపై ప్రభావవంతంగా ఉంటుంది. మొదటి మానవ పరీక్ష విజయవంతమైతే, ఈ టీకా పెద్ద మార్పును కలిగిస్తుంది.
ఇవి కూడా చదవండి: Solar Flare: సూర్యునిలో పేలుడు.. సౌర తుపానుగా భూమిపైకి.. కమ్యూనికేషన్లపై కనిపించనున్న ఎఫెక్ట్!
Microsoft: ఆపిల్‌ను వెనక్కి నెట్టేసిన మైక్రోసాఫ్ట్.. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ!
By Polls 2021: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 29 అసెంబ్లీ.. 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు ఈరోజే..