Corona: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే కరోనా కావొచ్చు.. వెంటనే జాగ్రత్తపడండి..
Coronavirus : దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే మూడు దఫాలుగా ముప్పుతిప్పలు పెట్టిన ఈ మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా 15వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి..
Coronavirus : దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే మూడు దఫాలుగా ముప్పుతిప్పలు పెట్టిన ఈ మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా 15వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 4,33,78,234 మంది ఈ ప్రమాదకరమైన వైరస్ బారిన పడ్డారు. 5,24,974 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసులుప పెరుగుతుండడంతో ఫోర్త్‌వేవ్, లాక్డౌన్ పదాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో దేశ పౌరులు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ (Corona virus) మానవ శరీరాన్ని పలు రకాలుగా ప్రభావితం చేస్తుంది. కొందరికీ జలుబు, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే.. మరికొందరు ఉదర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ జీర్ణవ్యవస్థలోకి ప్రవేశిస్తే తీవ్రమైన కడుపు నొప్పి తదితర శారీరక సమస్యలు తలెత్తుతాయి. కరోనా తీవ్రత నేపథ్యంలో వీటిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కడుపు నొప్పి
కరోనా బాధితులు కడుపు సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్లు ఇటీవల పలు పరిశోధనల్లో వెల్లడైంది. కడుపునొప్పితో పాటు తలనొప్పి, అలసట కూడా వీరిని బాధిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. చికిత్స కోసం వైద్యుడి వద్దకు కూడా వెళ్లండి.
ఆకలి తగ్గిపోవడం
కరోనా లక్షణాలకు సంబంధించి ఇటీవల కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ఆకలి తగ్గిపోవడం ఒకటి. ఉదర సంబంధిత సమస్యల కారణంగా కరోనా రోగుల్లో ఆకలి తగ్గిపోతుంది. కరోనా ఉన్న ముగ్గురిలో ఒకరికి ఇలా సంభవిస్తుందని అధ్యయనాల్లో వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మరొక విషయమేమిటంటే కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలామందికి ఆకలి తగ్గిపోతుందట. కాబట్టి ఆకలి లేకపోవడం, రుచి, వాసన చూసే సామర్థ్యం తగ్గిపోయినట్లైతే వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలి.
అతిసారం
ఊపిరితిత్తులతో పాటు పొట్టపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతంది కరోనా వైరస్. ముఖ్యంగా అతిసారం సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించిన వైరస్ జీర్ణక్రియపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అతిసారం, విరేచనాలు తదితర సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సొంత వైద్య చిట్కాలు పాటించకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..