Cold Coffee: సమ్మర్‌లో కోల్డ్ కాఫీ ఎక్కువగా తాగేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు.. వెంటనే ఆపేయాల్సిందే
కోల్డ్ కాఫీని రుచికరంగా చేయడానికి ఇందులో మోతాదుకు మించి చక్కెరను ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో, కోల్డ్ కాఫీని అధికంగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఇది క్రమంగా టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది.
దేశ రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అస్తవ్యస్థలు పడుతున్నారు. సూర్యుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. అందులో కోల్డ్ కాఫీ ఒకటి. వేసవిలో చాలామంది ఎక్కువగా కోల్డ్ కాఫీ తాగుతారు. అయితే ఈ కోల్డ్ కాఫీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కోల్డ్ కాఫీని రుచికరంగా చేయడానికి ఇందులో మోతాదుకు మించి చక్కెరను ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో, కోల్డ్ కాఫీని అధికంగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఇది క్రమంగా టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఇక కోల్డ్ కాఫీలోని కెఫిన్ నిద్రపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇది క్రమంగా పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజూ చాలా కోల్డ్ కాఫీ తాగితే ఎక్కువగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే తలనొప్పి, మైకం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. అలాగే త్వరగా అలసిపోతారు. చిన్న చిన్న పనులకు కూడా చిరాకుపడిపోతారు.
కాగా మనలో చాలామందికి చూసుకున్నట్లయితే రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారు చాలా సులువుగా వ్యాధుల బారిన పడతారు. అలాంటి వారు కోల్డ్ కాఫీకి దూరంగా ఉండాలి. వారు కోల్డ్ కాఫీని తీసుకోవడం వలన వారి రోగ నిరోధక శక్తి ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రోజుకు సగటున మన బాడీలోకి కేవలం 400 మిల్లీ గ్రాముల కెఫీన్ మాత్రమే వెళ్లాలి. అంత కన్నా తక్కువ పరిమాణంలో తీసుకున్నా వచ్చే నష్టం ఏమీ లేదు కానీ మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తాయి. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు కాఫీని తక్కువగా తీసుకోవాలి. అలాగే కోల్డ్ కాఫీ తాగే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..