Vegetables Storage Tips: తరిగిన కూరగాయల్ని ఫ్రెష్‌గా వారం రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయవచ్చు!
ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో అన్నీ హడావిడిగా ముగుస్తాయి. నిజం చెప్పాలంటే కొంత మందికి సరైన భోజనం చేయడానికి కూడా సమయం ఉండదు. దానికి తోడు ఇంటి పనులు చేయడం అంటే మాటలా.. ఇప్పుడున్న కాలంలో జాబ్ చేసే మహిళల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇంట్లో పనులు, పిల్లలు, జాబ్ వీటన్నింటినీ మహిళలు మ్యానేజ్ చేయాలంటే చాలా కష్టం. వంట చేయాలంటే కూరగాలు కట్ చేసే దగ్గరే టైమ్ ఆలస్యం అయిపోతుంది. దీంతో ముందు రోజు..

ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో అన్నీ హడావిడిగా ముగుస్తాయి. నిజం చెప్పాలంటే కొంత మందికి సరైన భోజనం చేయడానికి కూడా సమయం ఉండదు. దానికి తోడు ఇంటి పనులు చేయడం అంటే మాటలా.. ఇప్పుడున్న కాలంలో జాబ్ చేసే మహిళల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇంట్లో పనులు, పిల్లలు, జాబ్ వీటన్నింటినీ మహిళలు మ్యానేజ్ చేయాలంటే చాలా కష్టం. వంట చేయాలంటే కూరగాలు కట్ చేసే దగ్గరే టైమ్ ఆలస్యం అయిపోతుంది. దీంతో ముందు రోజు రాత్రే కట్ చేసుకుని పెట్టుకుంటారు. అయితే కట్ చేసిన కూరగాయల్ని వారం రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో ఫ్రెష్‌గా స్టోర్ చేయవచ్చు. అదెలాగ అని ఆలోచిస్తున్నారా.. మరి ఆ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
డీప్ ఫ్రిజ్‌లో..
కట్ చేసిన కూరగాయల్ని డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వాటి రంగు, ఆకృతి పోకుండా ఉంటుంది. వంట చేసే అరగంట ముందు బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రెష్‌గా ఉంటాయి.
ఆలీవ్ ఆయిల్‌తో..
కట్ చేసిన కూరగాయలు సంరక్షించుకోవడానికి మరో టెక్నిక్ కూడా ఉంది. తరిగిన కూరగాయలకు ఆలీవ్ ఆయిల్ అప్లై చేయాలి. కూరగాయలు పెట్టే బాక్స్‌లో కూడా అడుగున ఆలీవ్ ఆయిల్ రాసి ఉంచితే కూరగాయలు ఫ్రెష్‌గా, పాడవ్వకుండా ఉంటాయి.
నిమ్మ రసంతో..
తరిగిన కూరగాయల రుచి, రంగు పోకుండా ఉండాలంటే.. నిమ్మ రసాన్ని తరిగిన కూరగాయలపై రాసి.. డీప్ ఫ్రిజ్‌లో పెడితే సరిపోతుంది.
గాలి చొరబడకుండా చేయాలి..
తరిగిన కూరగాయలకు గాలి తగిలితే వెంటనే పాడై పోయే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఎయిర్ టైట్ బాక్సుల్లో పెడితే సరిపోతుంది.
ఒకే కంటైనర్‌లో ఉంచకూడదు..
తరిగిన కూరగాయలను ఎప్పుడూ ఒకే బాక్‌లో పెట్టకూడదు. అవి ఒక్కో గుణాన్ని కలిగి ఉంటాయి. దీంతో త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కో కంటైనర్‌లో ఒక్కో వెజిటేబుల్స్ ఉంచడం బెటర్. అదే విధంగా మీరు ఉపయోగించే కంటైనర్స్ కూడా పొడిగా ఉండేలా చూసుకోండి. లేదంటే వెజిటేబుల్స్ కుళ్లి పోతాయి.
ఉల్లిపాయలు – వెల్లుల్లి సపరేట్‌గా..
తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి నిల్వ చేయాలనుకుంటే.. ఇతర కూరగాయలతో కలపకూడదు. వీటిని వేరుగా నిల్వ చేయాలి. వీటితో పాటు ఇతర కూరగాయలు నిల్వ చేస్తే.. త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








