AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Care: మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి.. లేదంటే..!

Child Care: ఏదైనా పని చేస్తున్నప్పుడు మీ పిల్లలు ఏకాగ్రత పెట్టకపోతే తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇలాంటి ప్రవర్తన మానసిక

Child Care: మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి.. లేదంటే..!
Child Care
Shiva Prajapati
|

Updated on: Mar 15, 2022 | 8:30 AM

Share

Child Care: ఏదైనా పని చేస్తున్నప్పుడు మీ పిల్లలు ఏకాగ్రత పెట్టకపోతే తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇలాంటి ప్రవర్తన మానసిక సమస్యకు సంకేతం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వైద్య పరిభాషలో దీనిని అటెన్సన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్(ADHD ) అంటారు. ఈ వ్యాధి కారణంగా, ఇతర సాధారణ పిల్లలతో పోలిస్తే పిల్లల మెదడు సరిగ్గా అభివృద్ధి జరుగదు. దీని కారణంగా పిల్లు పనీ సక్రమంగా చేయలేకపోతారు. ప్రారంభ దశలో, చాలామంది తల్లిదండ్రులు పిల్లలలో ఈ సమస్యను విస్మరిస్తారు. దాంతో ఈ సమస్య చాలా తీవ్ర రూపం దాల్చుతుంది. వైద్యుల ప్రకారం.. బాల్యంలో ఏదైనా మెదడు గాయం, జన్యుపరమైన కారణాలు, గర్భధారణ సమయంలో పిల్లల మెదడు అభివృద్ధి చెందకపోవడం వంటి కారణాల చేత పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతుంటారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రకారం.. ADHD సమస్య ఎక్కువగా ప్రీ-స్కూల్ పిల్లలలో సంభవిస్తుంది. అనేక సందర్భాల్లో ఈ వ్యాధి యుక్తవయస్సు, వయోజన దశలో కూడా సంభవించవచ్చు. సీనియర్ సైకియాట్రీ స్పెషలిస్ట్ డాక్టర్ రాజ్‌కుమార్ ప్రకారం.. పిల్లలలో ఎడిహెచ్‌డి లక్షణాలు ప్రారంభంలోనే కనిపిస్తాయి. ఈ వ్యాధిలో, పిల్లవాడు తనపై తాను నియంత్రణ కోల్పోతాడు. ఏ పని మీదా దృష్టి పెట్టలేకపోతారు. పదే పదే అవే తప్పులు చేస్తుంటారు. పిల్లలు ఎక్కువగా మాట్లాడతారు. లేదా తరచుగా మౌనంగా ఉంటారు. ఈ పిల్లలు ఇతర పిల్లలతో అంత ఈజీగా కలిసి ఉండరు. ఒక్కోసారి వారికి హఠాత్తుగా కోపం వస్తుంది. ఇలాంటి పిల్లలు ఏదైనా గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడతారు.

పిల్లలకు ఈ సమస్యలు ఉన్న సమయంలో.. వారి ఇంట్లో ఒత్తిడి వాతావరణం ఉంటే ఈ వ్యాధి తీవ్రత మరింత పెరగడం ప్రారంభం అవుతుంది. ఇంట్లో ఒత్తిడి వాతావరణం కారణంగా తీవ్రమైన లక్షణాలు కూడా పిల్లల్లో రావడం ప్రారంభమవుతుంది. ADHDకి నిర్ధిష్ట చికిత్స అంటూ లేదు. పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వడం, వివిధ మార్గాల ద్వారా లక్షణాలను తగ్గించడం ద్వారా వ్యాధిని నయం చేయొచ్చు. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు మందుల ద్వారా చికిత్స అందిస్తారు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి.. 1. పిల్లలను బయటికి తీసుకెళ్లండి 2. టీ, కాఫీలకు దూరంగా ఉంచండి 3. ప్రోటీన్, విటమిన్లు ఉండే ఆహారం అందించండి 4. పిల్లలతో కోపంగా ఉండొద్దు. 5. పిల్లలకు టాస్క్ ఇవ్వడం, వాటిని పూర్తి చేసేలా ప్రోత్సహించడం చేయాలి.

Also read:

Sandhya Raju: ఆకట్టుకుంటున్న నాట్యం హీరోయిన్ ఫినామిల్ ఉమెన్ వీడియో.. ప్రశంసలు కురిపించిన ఎఆర్ రెహమాన్..

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

DSCR: ఏదైనా కంపెనీ బలం తెలుసుకోవాలంటే.. ఈ రేషియోను తప్పక చూడండి..