Fitness Tips: మీరు బిజీగా ఉన్నప్పటికీ ఈజీగా బరువు తగ్గొచ్చు.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..
Fitness Tips: కొందరి షెడ్యూల్ చాలా బిజీగా ఉండడం వల్ల ఆరోగ్యంపై అంత శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. ఈ కారణంగా వారు అనేక రోగాల బారిన పడుతుంటారు.
Fitness Tips: కొందరి షెడ్యూల్ చాలా బిజీగా ఉండడం వల్ల ఆరోగ్యంపై అంత శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. ఈ కారణంగా వారు అనేక రోగాల బారిన పడుతుంటారు. షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నవారు లేదా కొన్ని కారణాల వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల బరువు క్రమంగా పెరుగుతూ ఉంటుంది. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. బరువు పెరగడం వల్ల కీళ్ల నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంది.
అయితే, బిజీ షెడ్యూల్‌లో కూడా బరువు తగ్గవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, దీనికోసం కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా సునాయాసంగా బరువును తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫైబర్ ఫుడ్ అధికంగా తినాలి.. జంక్ ఫుడ్, తప్పుడు జీవన శైలి కారణంగా ఉదర సంబంధిత సమస్యలు మొదలవుతుంటాయి. ఫలితంగా బరువు క్రమంగా పెరుగుతుంటారు. అయితే, ఆరోగ్య కరమైన బరువు తగ్గడానికి మొదట జీర్ణవ్యవస్థను సరిదిద్దడం అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారం తినాలి. సరైన మోతాదులో ఫైబర్ ఫుడ్ తీసుకుంటే.. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుంది. మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
అతిగా తినడం మానుకోండి.. చాలా మంది బిజీ షెడ్యూల్స్‌లోనూ అతిగా ఉంటుంటారు. అతిగా తిని.. శారీరక శ్రమ లేకపోతే విపరీతంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఇలా పెరిగే బరువు ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. అందుకే.. అతిగా తినడం మానుకోవాలి. అలా చేస్తే శరీరంలో కేలరీల పరిమాణం తగ్గిపోతుంది. ఇది మీరు బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది.
తగినంత నిద్ర పోవాలి.. చాలా మంది తమ పని కారణంగా అలసిపోతుంటారు. దాంతో అతిగా నిద్రపోతుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక నిద్ర కూడా బరువు పెరగడానికి ఒక కారణం. 7 నుండి 8 గంటలు నిద్రపోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు. ఎక్కువ నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరిస్తున్నారు. తక్కువ నిద్రపోయినా హానికరమేనట. తక్కువ నిద్రపోవడం వల్ల శరీరంలో కేలరీలు ఎక్కువగా ఖర్చై.. విపరీతమైన ఆకలి వేస్తుందట. అలా ఫుడ్ అధికంగా తీసుకోవడం వలన బరువు పెరుగుతారని, అందుకే సరిపడా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also read:
Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
DSCR: ఏదైనా కంపెనీ బలం తెలుసుకోవాలంటే.. ఈ రేషియోను తప్పక చూడండి..