Child Care: వాతావరణ మార్పుల ఎఫెక్ట్.. పిల్లల ఆరోగ్యం దెబ్బతినొచ్చు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి..

ప్రస్తుతం వాతావరణం చిత్ర విచిత్రంగా ఉంటుందో. ఓవైపు చలి, మరోవైపు ఎండ, కాసేపటికే వర్షం.. ఇలా మిశ్రమ వాతావరణ పరిస్థితులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర..

Child Care: వాతావరణ మార్పుల ఎఫెక్ట్.. పిల్లల ఆరోగ్యం దెబ్బతినొచ్చు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి..
Children Care
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 28, 2022 | 3:26 PM

ప్రస్తుతం వాతావరణం చిత్ర విచిత్రంగా ఉంటుందో. ఓవైపు చలి, మరోవైపు ఎండ, కాసేపటికే వర్షం.. ఇలా మిశ్రమ వాతావరణ పరిస్థితులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఈ సీజన్‌లో పిల్లలు వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా దగ్గు, జలుబు సమస్యతో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల్లో దగ్గు చాలా కలవర పెడుతుంది. ఇది అంత సులభంగా తక్కవ కాదు. ఫలితంగా పిల్లలు ఆందోళన చెందుతారు. ఈ దగ్గు వలన పిల్లలు సరిగా ఆహారం తీసుకోకపోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. చలికాలంలో పిల్లలు జలుబు, దగ్గు బారిన పడకుండా ఉందేకు కొన్ని ఇంటి చిట్కాలు సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిని పాటించడం ద్వారా పిల్లలను ఆరోగ్యంగా ఉంచొచ్చని చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తేనె..

మీ పిల్లలు సంవత్సరం వయసు దాటినట్లితే వారికి కొద్దిగా వేడి నీటిలో తేనె, పసుపు వేసి తాపాలి. ఇలా చేయడం వలన దగ్గు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

వేడి నీటితో స్నానం..

పిల్లలకు వేడి నీటితో స్నానం చేయించాలి. అలాగే గోరువెచ్చని నీటిని తాగించాలి. అలా వేడి నీటిని తాపడం వల్ల ఊపిరితిత్తులు క్లియర్ అవుతాయి. గొంతులో అడ్డుకున్న శ్లేష్మం క్లియర్ అవుతుంది. దీని కారణంగా దగ్గు సమస్య తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

హ్యూమిడిఫైయర్..

గదిలోని గాలిలో తేమ లేకపోవడం, పొడిగా ఉండటం వల్ల దగ్గు సమస్యను మరింత పెంచుతుంది. అందుకని, గదిలో కాస్త తేమ వాతావరణం ఉండేలా చూసుకోవాలి.

గమనిక: ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిపుణులు తెలిపిన సలహాల మేరకు ఈ వార్తను పబ్లిష్ చేయడం జరిగింది దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడంలేదు. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..