Har Ghar Dastak: జూన్‌ నుంచి హర్ ఘర్ దస్తక్ 2.0.. 200 కోట్ల కొవిడ్‌ వాక్సినేషనే లక్ష్యం..!

Har Ghar Dastak: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో నిర్వహిస్తున్న కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ సంఖ్య 192 కోట్లు దాటింది. రోజు రోజుకి టీకాల

Har Ghar Dastak: జూన్‌ నుంచి హర్ ఘర్ దస్తక్ 2.0.. 200 కోట్ల కొవిడ్‌ వాక్సినేషనే లక్ష్యం..!
Covid Vaccination
Follow us

|

Updated on: May 22, 2022 | 3:54 PM

Har Ghar Dastak: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో నిర్వహిస్తున్న కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ సంఖ్య 192 కోట్లు దాటింది. రోజు రోజుకి టీకాల సంఖ్య మరింతగా పెరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్టోబర్ 2021న భారతదేశం 100 కోట్ల (ఒక బిలియన్) కోవిడ్ వ్యాక్సిన్‌లను అందించింది. ఇప్పుడు 200 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ దిశగా దూసుకువెళుతుంది. ఈ లక్ష్యాన్ని త్వరగా సాధించడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని కేంద్రం సూచించింది. జూన్ నుంచి రెండు నెలల పాటు హర్ ఘర్ దస్తక్ ప్రచారాన్ని 2.0 కోసం ప్లాన్ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలని(UTలు) ఆదేశించింది. అర్హులైన లబ్ధిదారులందరికి టీకా వేయాలని కోరింది. టీకా కవరేజీని గణనీయంగా పెంచాలని తెలిపింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో జరిగిన సమావేశంలో.. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ.. కోవిడ్-19 వ్యాక్సిన్‌ల మోతాదును ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయిలలో రెండు నెలల పాటు సాగే హర్ ఘర్ దస్తక్ అభియాన్ 2.0 ని ప్లాన్ చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు భూషణ్ సూచించారు. కరోనా వ్యాక్సిన్ అమూల్యమైన జాతీయ వనరు అని, అది వృధా కాకుండా చూసుకోవాలని నొక్కి చెప్పారు. డిసెంబర్ 2021 నుంచి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వారి డిమాండ్‌కి అనుగుణంగా వ్యాక్సిన్ డోస్‌లను సరఫరా చేశామని చెప్పారు.

ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రజలందరికీ మొదటి, రెండు డోసుల, బూస్టర్‌ డోస్‌లు వేయడం, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలలోని వారందరూ వ్యాక్సిన్‌లు తీసుకునేలా దృష్టిసారించడం తదితరాలు హర్ ఘర్ దస్తక్ 2.0′ ప్రధాన లక్ష్యమ‌ని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. వ్యాక్సిన్‌ డ్యూ-లిస్ట్‌ల ఆధారంగా సమర్ధవంతంగా పర్యవేక్షించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి