Temperatures: దంచి కొడుతున్న ఎండలు.. ఈ రోగులకి పొంచి ఉన్న ప్రమాదం..!

Temperatures: గత కొన్ని వారాలుగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో 49 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి . అయితే తీవ్రమైన

Temperatures: దంచి కొడుతున్న ఎండలు.. ఈ రోగులకి పొంచి ఉన్న ప్రమాదం..!
Temperatures
Follow us
uppula Raju

|

Updated on: May 22, 2022 | 4:38 PM

Temperatures: గత కొన్ని వారాలుగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో 49 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి . అయితే తీవ్రమైన వేడిగాలులు పెరిగిన ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ హాని చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. బీపీ, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి వేడిని తట్టుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితులలో జ్వరం, వైరల్ జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస ఆడకపోవడం, BP పెరుగుదల వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లలలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం అధిక ఉష్ణోగ్రతలు 2000 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం సగటున 1.75 మిలియన్ల మరణాలకు దారితీశాయని పేర్కొంది. ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ప్రపంచ సగటు మరణాల శాతం అధికంగా ఉంది.

సాధారణంగా శరీరం అంతర్గత ఉష్ణోగ్రత దాదాపు 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది. అయితే బయట ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మెదడులోని హైపోథాలమస్ ఒక వ్యక్తికి చెమట పట్టేలా చేస్తుంది. ఒకవేళ శరీరం చెమట పట్టకపోతే అంతర్గత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో హీట్‌స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది షాక్‌కు దారితీస్తుంది ఈ పరిస్థితులలో మరణం సంభవిస్తుంది. అలాగే హైపర్ థైరాయిడిజం ఉన్నవారు విపరీతమైన వేడి సమయంలో అసౌకర్యానికి గురవుతారు. అంతర్గత శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. విపరీతంగా చెమటలు పడుతాయి. అధిక ఉష్ణోగ్రతలు ఈ సమస్యని మరింత పెంచుతాయి. అందుకే వేసవిలో ఇలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి