AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

weight loss tips: అధిక బరువుతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆకులు తినండి చాలు..!

ప్రస్తుత జీవన విధానంతో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీంతో బరువు(weight) తగ్గించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. సరైన వ్యాయామం చేయడంతో పాటు ఓ చెట్టు ఆకులు తింటే బరువు తగ్గొచట..

weight loss tips: అధిక బరువుతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆకులు తినండి చాలు..!
Guava Leaves
Srinivas Chekkilla
|

Updated on: May 22, 2022 | 3:44 PM

Share

ప్రస్తుత జీవన విధానంతో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీంతో బరువు(weight) తగ్గించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. సరైన వ్యాయామం చేయడంతో పాటు ఓ చెట్టు ఆకులు తింటే బరువు తగ్గొచట.. ఆ ఆకులు ఏవో కాదు జామ ఆకులు(guava leave). జామపండులో అనేక రకాల పోషక విలువలుంటాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ లకు మంచి ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇది జీర్ణక్రియ, ఇతర సమస్యలను తొలగించడానికి దోహదపడుతుంది. జామ పండే కాకుండా ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. జామ ఆకులను తీనడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జామ ఆకుల్లో చాలా రకాల ఔషధ(Medicine) గుణాలు ఉన్నాయి. ఇవి మీ శరీరానికి మేలు చేస్తాయి.

శరీరంలో కాంప్లెక్స్ స్టార్చ్ చక్కెరగా మారి బరువు పెరగడం ప్రారంభమవుతుంది. జామ ఆకులు బరువు తగ్గడానికి తోడ్పడతాయని వైద్యులు వివరిస్తున్నారు. అలాగే ఈ ఆకులలో కార్బోహైడ్రేట్లను తగ్గించే శక్తి ఉండడం వల్ల వీటిని తింటే ఊబకాయం దూరమవుతుందట. జామ ఆకులు అతిసారం వ్యాధి సమస్యతో బాధపడుతున్న వారికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ ఆకులను గ్లాసు నీటిలో వేసి మరిగించి రోజుకు రెండుసార్లు తాగితే పొట్ట తగ్గుతుంది. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీనిని తగ్గించడానికి జామ ఆకుల టీ తాగడం మంచిదంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

జామ ఆకులతో తయారు చేసిన టీని తాగడం ద్వారా శరీరంలో ఆల్ఫా-గ్లూకోసిడేస్ ఎంజైమ్ చర్యను తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. జామ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరచడమే కాకుండా.. వీటిని మెత్తగా నూరి తలకు పట్టిస్తే జుట్టు సిల్కీగా అవుతుంది.

ఇవి కూడా చదవండి

Note:- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి…