Health Tips: ఎక్కువ మంది మహిళల్లో వచ్చే ఈ ఇన్ఫెక్షన్లకు చక్కని పరిష్కారాలు..

మనం నిత్యజీవితంలో చాల రకాల ఇన్ఫెక్షన్లను చూస్తూ ఉంటాం. చాలా మంది రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా మహిళల్లో వచ్చే ప్రధానమైన ఇన్ఫెక్షన్లలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఒకటి. ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్‎కు సంబంధించినది. ఈ రకమైన ఈస్ట్ ఇన్ఫెక్షన్ కాండిడా అనే ఫంగస్ వల్ల వస్తుంది.

Health Tips: ఎక్కువ మంది మహిళల్లో వచ్చే ఈ ఇన్ఫెక్షన్లకు చక్కని పరిష్కారాలు..
Yeast Infections
Follow us
Srikar T

|

Updated on: Mar 31, 2024 | 9:38 PM

మనం నిత్యజీవితంలో చాల రకాల ఇన్ఫెక్షన్లను చూస్తూ ఉంటాం. చాలా మంది రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా మహిళల్లో వచ్చే ప్రధానమైన ఇన్ఫెక్షన్లలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఒకటి. ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్‎కు సంబంధించినది. ఈ రకమైన ఈస్ట్ ఇన్ఫెక్షన్ కాండిడా అనే ఫంగస్ వల్ల వస్తుంది. అందుకే దీనిని వెజైనల్ కాండియాసిస్ అని పిలుస్తుంటారు. అది శరీరంలో ప్రవేశించినపుడు.. యోని గుండా ఉండే ముత్రనాళాల ద్వారాలకు వాపు, ముత్రంలో మంట, విపరితమైన దురదకు దారి తీస్తుంది.

ఈ ఇన్ఫెక్షన్ సహజంగా పాఠశాల్లో , కళాశాల్లలో చదువుతున్న ఆడ పిల్లలో, బయట పనిచేసే మహిళ్లో ఎక్కువగా వస్తుంది. దేశంలో ఏడాదికి 75 నుంచి 85 శాతం ఆడవాళ్లు దీని బారిన పడుతున్నట్లు సమాచారం. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్ నిర్వహించిన సర్వే ప్రకారం ఏడాదికి దాదాపు 4.7లక్షల కేసులు నమోదు అవుతుందాని పరిశోధకులు చెబుతున్నారు. మరి అటువంటి ఈస్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అలాగే బయట విరివిగా లభ్యమైయ్య యాంటిబయాటిక్స్ వాడకూండా ఇంట్లో అందుబాటులో ఉండే వాటితో ఈ సమస్యకు చెక్ పెడదం అని ఆలోచించే వారి కోసం పూర్తి వివరాలు ఇక్కడ పొందుపరుస్తున్నాము.

ఇది ఎవరికి వస్తుందంటే..

ఎక్కువ శాతం యాంటిబైటిక్స్ వాడే వారికి డయాబెటిస్ ఉన్నవారు. ఎక్కువ చెమటపట్టే శరీర గుణం గల వారికి. ఎక్కువగా రతిలో పాల్గొనే మహిళల్లో. బరువు ఎక్కువగా ఉన్నవారిలో. తరచూ పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగించే వారిలో అధికంగా వస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

ఈస్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు..

  • ఎక్కువ ఒత్తిడిగా ఉండడం.
  • ప్రశాంతత లేకపోవడం.
  • ముత్రంలో మంట.
  • రుతుక్రమంలో వివిధ రకాల రంగుల్లో వైట్ డిస్చర్జ్ కావడం.

హోమ్ రెమిడిస్..

  • మంచి నీరు ఎక్కువగా తాగడం.
  • కొబ్బరి బోండాలు , చెరుకు రసం ఎక్కువ తీసుకోవడం.
  • లోదుస్తులు మంచి ఫ్యేబ్రక్స్‎తో చేసినవి, ప్యూర్ కాటన్ వంటివి ఉపయోగించడం.
  • వేపఆకును మరిగించి ఆ నీటితో శుభ్ర పడుచుకోవడం, స్నానం చేయడం.
  • చిన్న, పెద్ద రోగాలకు తెలిసి తేలియకుండా యాంటిబయాటిక్స్ వడకూండా ఉండడం.
  • పెరుగు, మజ్జిగను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.