Cancer: క్యాన్సర్‌ లక్షణాలు..శరీరం ముందుగానే చూపించే ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి..

శరీరంలో ఎక్కడైనా గడ్డలు కనిపించడం మరొక లక్షణం. క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలో అతిపెద్ద సవాళ్లలో ఒకటి. లక్షణాలను గుర్తించడం, ప్రాణాంతక కణితుల మధ్య తేడాను గుర్తించడం. అన్ని కణితులు క్యాన్సర్ కావు. అయితే గడ్డలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకండి. క్యాన్సర్ రోగుల్లో జ్వరం సాధారణ లక్షణం. క్యాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరూ తరచూగా జ్వరం బారిన పడతారు. లుకేమియా లేదా లింఫోమా వంటి వాటికి జ్వరం ప్రాథమిక లక్షణం. లుకేమియా లాంటి కొన్ని క్యాన్సర్లలో అలసటే తొలి లక్షణంగా ఉంటోంది.

Cancer: క్యాన్సర్‌ లక్షణాలు..శరీరం ముందుగానే చూపించే ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి..
Cancer Symptoms
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 18, 2024 | 7:35 PM

క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. అందుకే ఈ క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది. క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే వ్యాధిని నయం చేయవచ్చు. రెగ్యులర్ క్యాన్సర్ పరీక్షలు, స్క్రీనింగ్‌లు గర్భాశయ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించగలవు. క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలో అతిపెద్ద సవాళ్లలో ఒకటి లక్షణాలను గుర్తించడం, ప్రాణాంతక కణితుల మధ్య తేడాను గుర్తించడం. సాధారణంగా విస్మరించబడే కొన్ని క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

– వేగంగా బరువు తగ్గడం లేదా తక్కువ సమయంలో బరువు తగ్గడం క్యాన్సర్‌కు సంకేతమని నిపుణులు అంటున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, కడుపు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా అన్నవాహిక క్యాన్సర్‌లో బరువు తగ్గడం అతి ముఖ్యంగా కనిపిస్తుందని చెప్పారు.

– తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకున్నప్పటికీ అలసటగా అనిపించడం క్యాన్సర్ మరొక లక్షణం. కడుపు క్యాన్సర్, లుకేమియా, పెద్దప్రేగు క్యాన్సర్ అలసటను కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

– గాయం నయం కాకపోతే అది చర్మ క్యాన్సర్ సంకేతం కావచ్చు. నిరంతర నోటి పుండ్లు నోటి క్యాన్సర్‌కు సంకేతమని అధ్యయనాలు చెబుతున్నాయి. మరొక లక్షణం నిరంతర దగ్గు లేదా బొంగురుమైన స్వరం. దగ్గు వారాలు, నెలలపాటు కొనసాగితే దానిని నిర్లక్ష్యం చేయవద్దు.

– చర్మ మార్పులను ఎప్పుడూ విస్మరించవద్దు. పుట్టుమచ్చ, మచ్చ రంగు మారడం, విస్తరించడం లేదా ఆకారంలో మార్పులు మెలనోమా లేదా ఇతర చర్మ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. శరీర రంగు నల్లగా మారిపోవడం (హైపర్‌పిగ్మెంటేషన్) శరీర రంగు, కళ్లు పసుపు పచ్చగా మారడం(జాండిష్), చర్మం ఎర్రగా మారడం, దురద రావడం.

– మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిగా అనిపించినా లేదా మూత్రంలో రక్తం కనిపించినా అది మూత్రాశయం లేదా ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంకేతమని నిపుణులు చెబుతున్నారు.

– శరీరంలో ఎక్కడైనా గడ్డలు కనిపించడం మరొక లక్షణం. క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలో అతిపెద్ద సవాళ్లలో ఒకటి. లక్షణాలను గుర్తించడం, ప్రాణాంతక కణితుల మధ్య తేడాను గుర్తించడం. అన్ని కణితులు క్యాన్సర్ కావు. అయితే గడ్డలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకండి.

– క్యాన్సర్ రోగుల్లో జ్వరం సాధారణ లక్షణం. క్యాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరూ తరచూగా జ్వరం బారిన పడతారు. లుకేమియా లేదా లింఫోమా వంటి వాటికి జ్వరం ప్రాథమిక లక్షణం. లుకేమియా లాంటి కొన్ని క్యాన్సర్లలో అలసటే తొలి లక్షణంగా ఉంటోంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి