చర్చి పునర్నిర్మాణ పనులు చేస్తుండగా అగ్గిపెట్టెలో దొరికిన ఉత్తరం..! అందులో ఏముందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..?

దానిలో ఇంకా ఇలా రాశారు..రాబోయే తరాలకు తదుపరి యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలో నేను సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మిమ్మల్ని మీరు బతికించుకోవాలంటే బియ్యం, కాఫీ, పిండి, పొగాకు, ధాన్యాలు, గోధుమలు వంటి ఆహార నిల్వలను సమకూర్చుకోవాలని చెప్పారు. లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసి, అవసరమైతే రెండో పెళ్లి చేసుకోవచ్చునని చెప్పారు. పెళ్లయిన వాళ్లు..

చర్చి పునర్నిర్మాణ పనులు చేస్తుండగా అగ్గిపెట్టెలో దొరికిన ఉత్తరం..! అందులో ఏముందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..?
Builder Discovers Note
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 18, 2024 | 5:51 PM

పురాతన భవనాలు, కట్టడాలు, ఇండ్లు, బావులు వంటివి మరమ్మతులు చేస్తుండగా, లేదంటే, కూల్చివేస్తుండగా ఊహించని నిధి నిక్షేపాలు దొరికాయనే వార్తలు మనం అనేకం వింటుంటాం. కొన్ని సందర్భాల్లో అలాంటి పాత కట్టడాలను శుభ్రం చేస్తుండగా, మనకు ఆశ్చర్యం కలిగించే కొన్ని పాత వస్తువులు కూడా కనిపించిన ఘటనలు విన్నాం. ఇప్పుడు అలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక బిల్డర్ పైకప్పును శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో అతను నేటి తరం దృష్టిని ఆకర్షిస్తున్న ఒక విషయాన్ని కనుగొన్నాడు. అతను బెల్జియంలోని చర్చిలో పనిచేస్తున్నప్పుడు తనకు అగ్గిపెట్టె దొరికిందని బిల్డర్ చెప్పాడు. గోడకు వేలాడుతున్న ఒక పెట్టెలో అగ్గిపెట్టె ఉందని, అందులో ఒక లేఖ లభించిందని చెప్పాడు. ఆ లేఖలో వారి పని విధానం, భవిష్యత్ తరాలకు సంబంధించి సలహాలు ఇచ్చారు. లేఖపై జూలై 21, 1941 తేదీ కూడా వ్రాయబడింది.

ఒక మీడియా కథనం ప్రకారం, ఈ శిల్పకారుడు సెయింట్ జేమ్స్ చర్చిలో 1941 నాటి ప్రత్యేకమైన సందేశంతో కూడిన లేఖను గుర్తించారు.. దానిపై నలుగురు వ్యక్తుల సంతకాలు కూడా ఉన్నాయి. సంతకం చేసిన వారిలో జాన్ జాన్సెన్, జూల్స్ గీసెలింక్, లూయిస్ చాంట్రైన్, జూల్స్ వాన్ హెమెల్డాంక్ ఉన్నారు. వీరంతా 82 సంవత్సరాల క్రితం ఇదే బిల్డింగ్‌ పైకప్పు మరమ్మతు పనిచేశారని తెలిసింది. వర్క్ కూపన్ వెనుక భాగంలో ‘ఈ పైకప్పుకు మళ్లీ రంగులు వేస్తే ఇక ఈ భూమిపై ఉండలేం’ అనే సందేశాన్ని అనువాదం చేశారు. మన జీవితం సంతోషంగా లేదని రాబోయే తరాలకు తెలియజేయాలి. మేము రెండు యుద్ధాలను ఎదుర్కొన్నాము. ఒకటి 1914లో, మరొకటి 1940లో.. ఇదంతా అవసరమా..? మనమందరం ఇక్కడ ఆకలితో పని చేస్తున్నాము. మాకు తిండి కూడా సరిగా పెట్టటం లేదని చెప్పారు. అతి తక్కువ కూలీ, ఎంతో కొంత డబ్బు చేతిలో పెట్టి తమతో చాలా పనిచేయిస్తున్నారని వారు తమ గోడు వెల్లబోసుకున్నారు.

దానిలో ఇంకా ఇలా రాశారు..రాబోయే తరాలకు తదుపరి యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలో నేను సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మిమ్మల్ని మీరు బతికించుకోవాలంటే బియ్యం, కాఫీ, పిండి, పొగాకు, ధాన్యాలు, గోధుమలు వంటి ఆహార నిల్వలను సమకూర్చుకోవాలని చెప్పారు. లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసి, అవసరమైతే రెండో పెళ్లి చేసుకోవచ్చునని చెప్పారు. పెళ్లయిన వాళ్లు ఇంటి బాగోగులు చూసుకోవాలి! పురుషులు సెల్యూట్!’ అంటూ వ్యాఖ్యనించారు. ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలకు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఆ నలుగురు వ్యక్తులకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడ్డారు అక్కడి అధికార సిబ్బంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..