AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending News: మ్యూజిక్‌ కచేరీలో వింత సంఘటన..! క్యూఆర్‌ కోడ్‌ ఉన్న టీ షర్ట్‌తో వచ్చిన యువకుడి హంగామా..కారణం తెలిస్తే కంగుతింటారు..

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లో, ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఆన్‌లైన్ లో హార్దిక్ సృజనాత్మక విధానం గురించి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అతని తెలివితేటలను సోషల్ మీడియా వినియోగదారులు కొనియాడారు. ప్రజలు దీనికి పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు యువకుడి ట్రిక్‌ బాగుందని ప్రశంసించారు. అతని క్రియేటివిటీని అభినందిస్తున్నారు. పోస్ట్‌ను లైక్‌ చేస్తూ, పెద్ద సంఖ్యలో కామెంట్లు కూడా చేశారు.

Trending News: మ్యూజిక్‌ కచేరీలో వింత సంఘటన..! క్యూఆర్‌ కోడ్‌ ఉన్న టీ షర్ట్‌తో వచ్చిన యువకుడి హంగామా..కారణం తెలిస్తే కంగుతింటారు..
Qr Code T Shirt
Jyothi Gadda
|

Updated on: Mar 18, 2024 | 5:08 PM

Share

Trending News: సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ప్రముఖ బ్రిటిష్ గాయకుడు, ప్రదర్శనకారుడు ED షీరన్ సంగీత కచేరీకి హాజరైన బాలుడి ఫోటో వైరల్ అవుతోంది. ఈ కచేరీ మార్చి 16న ముంబైలో జరిగింది. ED షీరన్‌కి భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ముంబైలో జరిగిన కచేరీకి వేలాది మంది హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ రోజు మ్యూజిక్ నైట్‌కి హాజరైన ఒక వ్యక్తి ఫోటో ఎక్కువగా వైరల్ అవుతోంది. దీనికి కారణం అతని టీ-షర్ట్. ఈ వైరల్‌ ఫోటోలను ఒక వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో షేర్‌ చేశాడు. ఇందులో కనిపిస్తున్న బాలుడు తెల్లటి టీ షర్ట్ ధరించి ఉన్నాడు. ఈ టీ-షర్ట్ ప్రత్యేకత ఏమిటంటే, వెనుక భాగంలో స్కాన్ చేయగలిగే QR కోడ్ ఉంది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీ-షర్టు పైన ‘ఫర్‌ సింగిల్‌ పీపుల్‌ ఓన్లీ’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది.

శ్వేతా కుక్రేజా అనే యూజర్ ఈ పోస్ట్‌ను X లో షేర్‌ చేస్తూ.. దానికి క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ టిండర్ ప్రొఫైల్ కోసం అని రాశారు. సదరు యువకుడు 22 ఏళ్ల హార్దిక్‌గా గుర్తించారు. అతను తన ప్రొఫైల్‌ను తన అభిమానులు యాక్సెస్ చేయడానికి ఈ ట్రిక్‌ను వాడాడని అన్నారు. QR కోడ్ రహస్యాన్ని వెల్లడిస్తూ శ్వేత పోస్ట్ చేసిన గంటల్లోనే 239,000 వ్యూస్‌, వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లో, ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఆన్‌లైన్ లో హార్దిక్ సృజనాత్మక విధానం గురించి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అతని తెలివితేటలను సోషల్ మీడియా వినియోగదారులు కొనియాడారు. ప్రజలు దీనికి పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు యువకుడి ట్రిక్‌ బాగుందని ప్రశంసించారు. అతని క్రియేటివిటీని అభినందిస్తున్నారు. పోస్ట్‌ను లైక్‌ చేస్తూ, పెద్ద సంఖ్యలో కామెంట్లు కూడా చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌లు మాయమవుతాయి! నథింగ్ సీఈఓ కార్ల్ పీ
స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాప్‌లు మాయమవుతాయి! నథింగ్ సీఈఓ కార్ల్ పీ
అనారోగ్యంతో మరణించిన కుక్క.. ఘనంగా అంత్యక్రియలు
అనారోగ్యంతో మరణించిన కుక్క.. ఘనంగా అంత్యక్రియలు
కబ్జాదారుల్లో అన్ని పార్టీల వారున్నారుః రంగనాథ్
కబ్జాదారుల్లో అన్ని పార్టీల వారున్నారుః రంగనాథ్
భోజనం తర్వాత కడుపులో గ్యాస్? ఈ 5 ఇంటి చిట్కాలతో వెంటనే ఉపశమనం..
భోజనం తర్వాత కడుపులో గ్యాస్? ఈ 5 ఇంటి చిట్కాలతో వెంటనే ఉపశమనం..
ఆదివారం తలస్నానం చేయొచ్చా?.. శాస్త్రం ఏం చెప్తోంది..
ఆదివారం తలస్నానం చేయొచ్చా?.. శాస్త్రం ఏం చెప్తోంది..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్