AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: టిక్కెట్లు లేకుండా ప్రయాణించే వారికి టీటీఈ షాక్ ..! తిక్క కుదిరింది.. వైరలవుతున్న వీడియో

వైరల్ వీడియోలో టీటీఈ ముందుగా అక్కడికి వచ్చి ప్రయాణికులు సహకరించాలని అభ్యర్థించాను కానీ, వారు నిబంధనలు పాటించకుండా గొడవకు దిగారని చెప్పాడు. కోచ్ లోపల కొందరు అతన్ని అడ్డుకున్నారు. తలుపు మూసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేలకు తాను కోచ్‌లోకి ప్రవేశించి, తనను ఆపిన యువకులను టిక్కెట్ల కోసం అడుగుతాడు.

Watch Video: టిక్కెట్లు లేకుండా ప్రయాణించే వారికి టీటీఈ షాక్ ..! తిక్క కుదిరింది.. వైరలవుతున్న వీడియో
Indian Tte
Jyothi Gadda
|

Updated on: Mar 15, 2024 | 1:01 PM

Share

భారతీయ రైల్వే నిత్యం ఎంతో మంది ప్రజలకు సౌకర్యవంతమైన రవాణాను అందజేస్తుంది. అయితే, రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే వారి సంఖ్య కూడా అంతగానే పెరుగుతుంది. ఈ విషయం రైల్వే యంత్రాంగంలో ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) పట్టుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్బంగా టిక్కెట్టు లేని ప్రయాణికులు టీటీఈపై దాడి చేశారు. బలవంతంగా అతన్ని కోచ్‌ నుంచి బయటకు తోసేశారు.. అయితే నాటకీయ పరిణామాలన్నీ వాళ్లు ఊహించని మలుపు తిరిగాయి. టిక్కెట్లు లేకుండా ప్రయాణించిన వారు చేసిన పనికి ఫలితం అనుభవించాల్సి వచ్చింది.

వైరల్ వీడియోలో, టీటీఈని వెనుకకు నెట్టడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులు తలుపు వద్ద టీటీఈని కొట్టడం కనిపిస్తుంది. వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి టికెట్ లేని ప్రయాణికుల వద్దకు వెళ్లి టీటీఈతో దురుసుగా ప్రవర్తించినందుకు వారిని తిట్టాడు. టీటీఈ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి షాకిస్తూ ఊహించని విధంగా కంప్లైట్ ఫైల్ చేశాడు..

ఇవి కూడా చదవండి

ఈ మేరకు టీటీఈ ముందుగా అక్కడికి వచ్చి ప్రయాణికులు సహకరించాలని అభ్యర్థించాను కానీ, వారు నిబంధనలు పాటించకుండా గొడవకు దిగారని చెప్పాడు. కోచ్ లోపల కొందరు అతన్ని అడ్డుకున్నారు. తలుపు మూసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేలకు తాను కోచ్‌లోకి ప్రవేశించి, తనను ఆపిన యువకులను టిక్కెట్ల కోసం అడుగుతాడు. అతను వారిద్దరిపై ఫిర్యాదు చేస్తాడు.  దాంతో వెంటనే ఆ ఇద్దరు టీటీఈ వేడుకోవటం మొదలుపెట్టారు.

ప్రారంభంలో, ఈ వీడియో అరహంత్ షెల్బీ అనే X ఖాతాలో షేర్‌ చేయబడింది. అనంతరం ఇది ప్రముఖ పేజీ ఘర్ కా కాలేష్ ద్వారా మళ్లీ పోస్ట్ చేయబడింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒకరు ఇలా వ్రాశారు, టిక్కెట్ లేదు…ఇంకా కొట్టడం, అంత ధైర్యం ఎక్కడ నుండి వస్తుందని ప్రశ్నించారు. ఇలా చాలా మంది నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్