AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: ఇదేం భక్తిరా సామీ..! ఎగిసిపడుతున్న మంటల్లోకి దూకిన భక్తులు.. వారికి ఆ దేవుడే దిక్కు..

ఇరవై ఒకటవ శతాబ్దంలో వైద్యం, విజ్ఞాన శాస్త్రంలో పురోగతి ఉన్నప్పటికీ, వైద్య చికిత్స కంటే భూతవైద్యానికి ఎక్కువ విలువనిచ్చే వ్యక్తులు ఇప్పటికీ ఎక్కువ మంది ఉన్నారంటూ చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యనించారు. కొందరు ఈ వీడియోను వినోదానికే పరిమితం చేయగా, మరికొందరు నెటిజన్లు మూఢనమ్మకాలు, చేతబడి నిరోధక చట్టాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.

Video Viral: ఇదేం భక్తిరా సామీ..! ఎగిసిపడుతున్న మంటల్లోకి దూకిన భక్తులు.. వారికి ఆ దేవుడే దిక్కు..
People Walk Through Fire
Jyothi Gadda
|

Updated on: Mar 15, 2024 | 12:19 PM

Share

నేటికీ చాలా మంది ప్రజలు మూఢ నమ్మకాలకు కట్టుబడి ఉంటున్నారు. మండుతున్న నిప్పులపై నడవడం దైవిక శక్తి అని నమ్మే సమాజం భారతదేశంలో ఇప్పటికీ ఉంది. కొందరు భక్తులు మూఢభక్తిలో వివిధ విన్యాసాలు కూడా చేస్తారు. ఒక్కోసారి కొందరు నిప్పుల గుండంలో నడుస్తుంటారు. మరి కొన్ని సార్లు మండే కర్పూరాన్ని మింగేస్తారు. ఇలాంటి భయానక భక్తికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఇప్పుడు వైరల్‌ అవుతున్న వీడియోలో కొందరు భక్తులు మంటల్లోకి దూకారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా వెన్నులో వణుకు పుడుతుంది. ఈ వీడియో కేరళకు చెందినదిగా తెలిసింది.

హోలీ పండుగకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. హోలీకి అన్ని చోట్లా సన్నాహాలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో కూడా హోలీని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో కేరళలో హోలీ పండగ సందడి మొదలైంది. మంటల్లోంచి జనం ఎలా దూకుతున్నారో వీడియోలో చూడొచ్చు. వారు ఒక వైపు నుండి మరొక వైపుకు ఎగిసి పడుతున్న మంటలను దాటి వెళుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, దీనికి సంబంధించిన సమాచారం వీడియో క్యాప్షన్‌లో ఇవ్వబడింది. ఈ ఆచారం భారతదేశంలోని కేరళలోని శ్రీ రాజ రాజేశ్వరి ఆలయంలో జరుగుతుంది. ఇది ఆలయ ప్రాంగణంలోని అగ్నిలో నడక వేడుక. ద్రౌపది దేవత ఆశీర్వాదం కోసం భక్తులు అగ్నిగుండాన్ని దాటడం ఇక్కడి భక్తుల ఆచారం అని వ్రాయబడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది అఘోరీల ఆచారం అని కొందరు అంటున్నారు.

ఇరవై ఒకటవ శతాబ్దంలో వైద్యం, విజ్ఞాన శాస్త్రంలో పురోగతి ఉన్నప్పటికీ, వైద్య చికిత్స కంటే భూతవైద్యానికి ఎక్కువ విలువనిచ్చే వ్యక్తులు ఇప్పటికీ ఎక్కువ మంది ఉన్నారంటూ చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యనించారు. కొందరు ఈ వీడియోను వినోదానికే పరిమితం చేయగా, మరికొందరు నెటిజన్లు మూఢనమ్మకాలు, చేతబడి నిరోధక చట్టాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..