Viral Video : బండెనుక బండి కట్టి… పదహారు బండ్లు కట్టి.. అంటున్న రిక్షా కార్మికులు..! భలేగా చేశారే..

వైరల్‌ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఈ బండికి బ్రేకులు ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. రైలు చిన్నదిగా ఉందని ఒకరు రాశారు. బంగ్లాదేశ్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సెల్ఫ్ డ్రైవింగ్ కోచ్‌లను ప్రారంభించింది అని ఒకరు రాశారు. ఇది స్మార్ట్ బంగ్లాదేశ్ అని ఒకరు రాశారు. మరికొందరు తమ శక్తిని ఎందుకు వృధా చేసుకుంటున్నారని రాశారు. మరొకరు ఈ వీడియో వినోదం కోసం బాగానే ఉందని, అయితే

Viral Video : బండెనుక బండి కట్టి... పదహారు బండ్లు కట్టి.. అంటున్న రిక్షా కార్మికులు..! భలేగా చేశారే..
Bangladesh Rickshaw
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 15, 2024 | 12:36 PM

జుగాడ్‌ విషయంలో భారతీయులతో ఎవరూ సాటి రాలేరని అంటారు. అయితే బంగ్లాదేశ్‌కు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రిక్షా కార్మికులు చేసిన జుగాఢ్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. వీడియోలో చాలా రిక్షాలు ఒక దానికి ఒకటి జత చేసిన తీరు వింతగా కనిపించింది. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులు కలిసి రోడ్డుపై అనేక రిక్షాలను నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జుగాడ్‌ని చూసిన సోషల్ మీడియా యూజర్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

వీడియోలో, ఒక రిక్షా ముందుకు కదులుతోంది, దాని వెనుక మరొక రిక్షా ముందు చక్రం కట్టబడి ఉంది. అదేవిధంగా అనేక రిక్షాలు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయి. ప్రతి రిక్షా మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు అందరూ కూడా రిక్షా తొక్కుతున్నారు. వీడియోలో రిక్షాలు ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేయబడి, రైలు కంపార్ట్‌మెంట్ లాగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రజలు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో Instagramలో the_outslder అనే ఖాతాతో షేర్ చేయగా, దీన్ని 2.5 లక్షల మందికి పైగా లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఈ బండికి బ్రేకులు ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. రైలు చిన్నదిగా ఉందని ఒకరు రాశారు. బంగ్లాదేశ్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సెల్ఫ్ డ్రైవింగ్ కోచ్‌లను ప్రారంభించింది అని ఒకరు రాశారు. ఇది స్మార్ట్ బంగ్లాదేశ్ అని ఒకరు రాశారు. మరికొందరు తమ శక్తిని ఎందుకు వృధా చేసుకుంటున్నారని రాశారు. మరొకరు ఈ వీడియో వినోదం కోసం బాగానే ఉందని, అయితే భద్రతా కోణం నుండి ప్రమాదకరమని రాశారు. ఎవరెన్ని చెప్పినా జపాన్ బుల్లెట్ రైలులా కనిపిస్తోందని మరొకరు రాశారు. అన్నీ చూశాక ఇప్పుడు రిక్షా రైలు కూడా చూడాల్సి వచ్చిందని ఒకరు రాశారు. జుగాద్‌లో భారతదేశ ప్రజలు ముందున్నట్లు అనిపించిందని, అయితే బంగ్లాదేశీయులు అందరినీ దాటేశారని సోషల్ మీడియా వినియోగదారు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..