లక్ అంటే ఇదే.. సముద్రంలో తేలియాడే నురుగ.. కట్ చేస్తే కోటీశ్వరుడు అయ్యాడుగా
కొందరు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లినట్లు వీడియోలో చూడవచ్చు. ఇంతలో.. వారిలో ఒక జాలరి సముద్రం మధ్యలో తేలుతున్న నురుగును చూశాడు. ఆ నురుగను చూసి షాక్ అయ్యి.. ఆ ఫోమ్‌ని కత్తిరించడం మొదలుపెట్టాడు. ఏదైనా ప్రత్యేకమైన వస్తువు దొరుకుంతుందో అంటూ వెతకడం ప్రారంభించాడు. అది ఏమిటంటే కోట్ల విలువ చేసే త్రిమింగళం వాంతు.
అదృష్టం కలిసి వస్తే ఒక్క క్షణం చాలు పేదవాడు రాజుగా మారడానికి అని పెద్దలు చెబుతూ ఉంటారు. లక్కు ఉంటే మనిషి జీవితంలో ప్రతిదీ మారుతుంది. ఒక సాధారణ వ్యక్తి క్షణ కాలంలో లక్షాధికారి అయిపోతాడు. ఎవరికైనా అకస్మాత్తుగా నిధి కనిపించింది, లాటరీ తగిలింది వంటి అనేక రకరకాల కథనాలను గురించి ఇప్పటి వరకు చాలా వింటూనే ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలి అనే రూల్ లేదు. కొన్నిసార్లు ఒక వ్యక్తి రాత్రికి రాత్రే ధనవంతులను చేసే ఏదో ఒకదానిని పట్టుకుంటాడు. ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఒక వ్యక్తి సముద్రం మీద నురుగు అంటూ పట్టుకున్నాడు.. అది అతడిని కోటీశ్వరుడిని చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కొందరు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లినట్లు వీడియోలో చూడవచ్చు. ఇంతలో.. వారిలో ఒక జాలరి సముద్రం మధ్యలో తేలుతున్న నురుగును చూశాడు. ఆ నురుగను చూసి షాక్ అయ్యి.. ఆ ఫోమ్‌ని కత్తిరించడం మొదలుపెట్టాడు. ఏదైనా ప్రత్యేకమైన వస్తువు దొరుకుంతుందో అంటూ వెతకడం ప్రారంభించాడు. అది ఏమిటంటే కోట్ల విలువ చేసే త్రిమింగళం వాంతు.
ఇక్కడ వీడియో చూడండి
View this post on Instagram
@wildheart_500 అనే ఖాతా ద్వారా ఈ క్లిప్ Instagramలో షేర్ చేశారు. ఈ వీడియోను నెటిజన్లు చూడడమే కాదు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అంతేకాదు ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దీన్ని మార్కెట్‌లో విక్రయించడం చట్టవిరుద్ధం’ అని ఒక వినియోగదారు రాశారు. ‘ఇది నిధి కంటే తక్కువ కాదు భాయి సాబ్ ‘ అని మరొకరు రాశారు.
తిమింగలం వాంతి ఎంత విలువైంది అంటే.. దీనిని భారీ ఖరీదుకు కొనుగోలు చేస్తారు. పెద్ద కంపెనీలు ఈ వాంతి నుండి పెర్ఫ్యూమ్‌లను తయారు చేస్తాయి. దీంతో మార్కెట్‌లో వీటికి డిమాండ్ చాలా ఎక్కువ. దీంతో దీని ధర కోట్లలో పలుకుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..