AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: డేంజర్‌ సింబల్‌.. ఎరుపు రంగులో అరుదైన నాగుపాము.. వైరలవుతున్న వీడియో

అరుదైన జాతి పాము. ఇది ఆఫ్రికాలో కనిపిస్తుంది. ఈజిప్ట్, టాంజానియా, ఉగాండా, సూడాన్ వంటి ప్రాంతాల్లో కనిపించే ఈ పాము శాస్త్రీయ నామం నజా పల్లీడ. ఈ పాములు అత్యధిక విష పూరితమైనవిగా చెబుతున్నారు. అందుకే వీటికి ఆ పేరు వచ్చిందని అంటున్నారు. వీడియో చూస్తుంటే సాధారణ నాగుపాము కంటే ఇది భిన్నంగా కనిపిస్తుంది. దానికి ఒంటి నిండా ఎరుపు రంగు పూసినట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.

Viral Video: డేంజర్‌ సింబల్‌.. ఎరుపు రంగులో అరుదైన నాగుపాము.. వైరలవుతున్న వీడియో
Red Colour Cobra
Jyothi Gadda
|

Updated on: Mar 18, 2024 | 4:33 PM

Share

పాములతో సహా ప్రపంచంలో ఎన్నో అరుదైన జంతువులు కనిపిస్తాయి. భూమిపై మూడు వేలకు పైగా జాతుల పాములు ఉన్నాయని పరిశోధకుల అంచనా. వీటిలో కొన్ని అత్యంత విషపూరితమైనవి. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన 69 రకాల పాములు ఉన్నాయి. ఇక పాములంటే అందరికీ హడలే. అల్లంత దూరంలో పాము ఉందని తెలిస్తే చాలు ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తుంటారు. అయితే, ఇప్పుడు ఒక అరుదైన పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఎప్పుడు చూడని ఎరుపు రంగు పాము కనిపిస్తుంది. ఇది విషపూరితమైన నాగుపాము. దీనిని చూసిన ప్రజలు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఎరుపు రంగు పామును పట్టుకోవడం కనిపిస్తుంది. అతడు పాము నడుము భాగంలో పట్టుకుని లాగిన వెంటనే ఆ పాము పడగ విప్పింది. దాంతో అది నాగుపాము అని అర్థం అవుతుంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాము రంగు ఎరుపు రంగులో ఉండటం. ఇది చాలా అరుదైన పాము. ఎరుపు రంగు పామును రెడ్ స్పిట్టింగ్ కోబ్రా అంటారట.

ఇవి కూడా చదవండి

యానిమల్ డైవర్సిటీ వెబ్‌సైట్ ప్రకారం, రెడ్ స్పిటింగ్ కోబ్రా అనేది అరుదైన జాతి పాము. ఇది ఆఫ్రికాలో కనిపిస్తుంది. ఈజిప్ట్, టాంజానియా, ఉగాండా, సూడాన్ వంటి ప్రాంతాల్లో కనిపించే ఈ పాము శాస్త్రీయ నామం నజా పల్లీడ. ఈ పాములు అత్యధిక విష పూరితమైనవిగా చెబుతున్నారు. అందుకే వీటికి ఆ పేరు వచ్చిందని అంటున్నారు. వీడియో చూస్తుంటే సాధారణ నాగుపాము కంటే ఇది భిన్నంగా కనిపిస్తుంది. దానికి ఒంటి నిండా ఎరుపు రంగు పూసినట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.

వైరల్‌ అవుతున్న వీడియో @snake_fraind అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా షేర్‌ చేయబడింది. సోషల్ మీడియా ఈ ఖాతాలో పాములకు సంబంధించి అనేక వీడియోలు పోస్ట్ చేయబడ్డాయి. ఇటీవల షేర్ చేసిన వీడియోలో ఇలాంటి ఎరుపు రంగు పాము కనిపించింది. చాలా మంది ఈ వీడియోను ఫేక్ అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..