కానీ, చపాతీ పిండిని ఫ్రిజ్‍లో పెట్టుకోవడం అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పిండిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో చపాతీ, పూరీలు వంటివి తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలా పిండి పాడయ్యే.. విషయం బయటకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ లోలోపల చర్య జరుగుతూనే ఉంటుంది. ఫ్రిజ్‍లో పెట్టిన చపాతీ పిండి.. మనకు తెలియని మార్గాల్లో ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుకే, ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.