Charcoal Soap Benefits: చార్‌కోల్ సోప్ వాడుతున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
బొగ్గు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దీని గురించి వినే ఉంటారు. బొగ్గునే ఇంగ్లీష్‌లో చార్ కోల్ అని పిలుస్తారు. ఇప్పుడంటే అన్నీ గ్యాస్ స్టవ్‌లు వచ్చేశాయ్ కానీ.. ఇంతకు ముందు అయితే ప్రతీ ఒక్కరి ఇంట్లోని కట్టెల పొయ్యి ఉండేదు. అందులో వచ్చిన బొగ్గును పళ్లు తోముకోవడానికి.. ఇతరత్ర పనులకు ఉపయోగించారు. ఇప్పుడు బొగ్గుతో అనేక రకాలైన సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇవి చర్మానికి అందాన్ని తీసుకొస్తున్నాయి. చర్మంలోని ట్యాక్సిన్స్..
Updated on: Mar 18, 2024 | 4:11 PM

బొగ్గు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దీని గురించి వినే ఉంటారు. బొగ్గునే ఇంగ్లీష్‌లో చార్ కోల్ అని పిలుస్తారు. ఇప్పుడంటే అన్నీ గ్యాస్ స్టవ్‌లు వచ్చేశాయ్ కానీ.. ఇంతకు ముందు అయితే ప్రతీ ఒక్కరి ఇంట్లోని కట్టెల పొయ్యి ఉండేదు. అందులో వచ్చిన బొగ్గును పళ్లు తోముకోవడానికి.. ఇతరత్ర పనులకు ఉపయోగించారు.

ఇప్పుడు బొగ్గుతో అనేక రకాలైన సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇవి చర్మానికి అందాన్ని తీసుకొస్తున్నాయి. చర్మంలోని ట్యాక్సిన్స్, మలినాలను, దుమ్ము, దూళి వంటి వాటిని బొగ్గు గ్రహిస్తుంది. బొగ్గును చర్మానికి ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ఇప్పుడు మార్కెట్లోకి బొగ్గుతో తయారు చేసిన ప్రోడెక్ట్స్ ఎన్నో వచ్చాయి. అందులో చర్మానికి రాసుకునే సబ్బు కూడా ఒకటి. ఇది రాసుకోవడం వల్ల చర్మం సాఫ్ట్‌గా మారుతుంది. అంతే కాకుండా.. చర్మంపై ఆయిల్స్ లేకుండా చేస్తుంది.

అలాగే చర్మాన్ని ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ని కూడా తొలగిస్తుంది. దీంతో మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై మొటిమలు రాకుండా చేస్తుంది.

ఈ చార్ కోల్ సోప్స్ వాడటం వల్ల చర్మంపై మంట కూడా అదుపు చేస్తుంది. సోరియాసిస్ ఉన్నవారు సైతం ఈ సబ్బును ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ బొగ్గు సబ్బు.. అకాల వృద్ధాప్యాన్ని కూడా నివారిస్తుంది. చర్మంపై ముడతలు, గీతలు లేకుండా చేస్తుంది.




