AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blindness: ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..

కాలక్రమేణా కంటి సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలలో 10 మంది పెద్దలలో ఆరుగురు దృష్టి లోపం తలెత్తుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే 40 శాతం మంది కొన్నిసార్లు చూడటంలో ఇబ్బంది పడుతున్నారు. 31 శాతం మంది తమ దృష్టి సరైనదని చెప్పారు. 74 శాతం మంది తమ కంటి చూపు బలహీనంగా ఉందని, దాని లక్షణాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. 20 ఏళ్లు

Blindness: ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
Blindness
Subhash Goud
|

Updated on: Apr 19, 2024 | 8:28 PM

Share

కాలక్రమేణా కంటి సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలలో 10 మంది పెద్దలలో ఆరుగురు దృష్టి లోపం తలెత్తుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే 40 శాతం మంది కొన్నిసార్లు చూడటంలో ఇబ్బంది పడుతున్నారు. 31 శాతం మంది తమ దృష్టి సరైనదని చెప్పారు. 74 శాతం మంది తమ కంటి చూపు బలహీనంగా ఉందని, దాని లక్షణాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. 20 ఏళ్లుగా స్పెక్‌సేవర్స్‌లో ఆప్టోమెట్రిస్ట్‌గా ఉన్న నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ జోసీ ఫోర్టే, మీ కళ్ళు బలహీనంగా మారుతున్నాయని మీరు గుర్తించే కొన్ని సంకేతాలు ఉన్నాయని చెప్పారు. వీటికి చికిత్స చేయకపోతే, మీ కళ్ళు వేగంగా క్షీణిస్తాయని అంటున్నారు.

మీ కళ్ళు పాడవుతున్నాయని గుర్తించడానికి డాక్టర్ జోసీ చెప్పిన సంకేతాలు

  1. మీరు హోటల్‌లో ఆహారం తినడానికి వెళ్లినట్లయితే, ఫుడ్ మెనూ లేదా చిన్న పదాలను స్పష్టంగా చదవాలి. అలాగే స్పష్టంగా కనిపించకపోయినా.. మీరు దానిని దూరం నుండి చదవడంలో ఇబ్బంది ఉన్నా.. కంటి సమస్య ఉన్నట్లు గమనించాలి.
  2. మీ మొబైల్‌లో పదాలను బాగా చదవడంలో ఇబ్బంది ఉండటం.
  3. మీరు విషయాలను చదవడానికి ప్రయత్నించినప్పుడు మీ ముఖ కవళికలు మారుతాయి.
  4. చదవడానికి లేదా ఏదైనా పని చేయడానికి మీకు సాధారణం కంటే ఎక్కువ లేదా ప్రకాశవంతమైన కాంతి అవసరం కావచ్చు.
  5. మీ దృష్టి సాధారణం చదవడంలో దూరదృష్టిలో లోపం కావచ్చు. దూరం నుంచి చదువుతున్నప్పుడు కూడా అక్షరాలు అస్పష్టంగా ఉంటుంది.
  6. ఏదైనా చదువుతున్నప్పుడు, మొబైల్‌లో చదువుతున్నడు కంటి నుంచి నీళ్లు రావడం.
  7. చదివిన తర్వాత లేదా చక్కటి పని చేసిన తర్వాత కంటి ఒత్తిడి లేదా తలనొప్పి రావడం.

మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా

  • పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోండి – ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలను చేర్చండి. ఇవి మీ మొత్తం ఆరోగ్యానికి అలాగే మీ కళ్ళకు ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. విటమిన్ సి, ఆకు కూరలు, చేపలు, పాలకూర, నారింజ వంటి వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి.
  • హైడ్రేటెడ్ గా ఉండండి- కళ్లకు, మొత్తం ఆరోగ్యానికి తగినంత నీరు తాగండి. తగినంత నీరు తాగడం వల్ల కళ్లలో పొడిబారిన సమస్య తొలగిపోతుంది, ఇది కళ్లకు ఉపశమనం ఇస్తుంది.
  • ధూమపానం మానేయండి- ధూమపానం అనేక వ్యాధులకు ప్రధాన కారణం. ఇది ముఖ్యంగా కళ్ల ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. ఇది కంటిశుక్లం, కంటి నరాల దెబ్బతినడం, దృష్టి లోపం, అంధత్వం వంటి సమస్యలను పెంచుతుంది.
  • విరామం తీసుకోండి- ఎక్కువ సేపు స్క్రీన్ వైపు చూస్తూ ఉండటం వల్ల కూడా కళ్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. స్క్రీన్ సమయాన్ని తగ్గిస్తున్నప్పుడు. ప్రతి గంట తర్వాత 20 నిమిషాల విరామం తీసుకోండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి