Black Rice: పూర్వం రాజులకోసమే మాత్రమే పండించిన నల్ల బియ్యం.. డాక్టర్లను సైతం ఆశ్చర్యపరుస్తున్న ఆరోగ్య ప్రయోజనాలు
Black Rice Benefits: బియ్యం ఆసియా ఖండంలోని ప్రజలకు ప్రధాన ఆహారం.. బియ్యంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్, నల్ల బియ్యం ఇలా అనేక రకాలున్నాయి..
Black Rice Benefits: బియ్యం ఆసియా ఖండంలోని ప్రజలకు ప్రధాన ఆహారం.. బియ్యంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్, నల్ల బియ్యం ఇలా అనేక రకాలున్నాయి. అయితే అతిపురాతన బియ్యం నల్ల బియ్యాన్ని ఈశాన్య భారతంలో పూర్వకాలంలో సాగు చేసేవారు. మనదేశం నుంచి చైనాలోకి అడుగుపెట్టి అక్కడ ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా నల్లబియ్యాన్ని రాజులు మాత్రమే తినడానికి పండించేవారని చరిత్రకారుల కథనం. ప్రస్తుతం తక్కువ సాగు చేస్తున్న ఈ నల్ల బియ్యం గురించి చాలా తక్కువ మందికి తెలుసు.
మణిపూర్ లో ప్రధాన ఆహారం నల్లబియ్యం.. అయుతే ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌లతో పాటు ఏపీ, తెలంగాణల్లో కూడా సాగు చేస్తున్నారు. బెంగళూరు సేంద్రియ దుకాణాల్లో ఒక కిలో నల్ల బియ్యం రూ. 200 కు దొరుకుంటుంది. అయితే ఈ బియ్యం అన్ని బియ్యం కంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
*నల్ల బియ్యం శాఖాహారులకు మంచి ప్రోటీన్లను ఇచ్చే ఆహారం. అనేక పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి.
*నల్ల బియ్యంలో విటమిన్ బి, ఇ, నియాసిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలలో తేలింది.
*వీటిలో ఆంథోసైనిన్స్ అధికంగా ఉన్నాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హానికర బ్యాక్టీరియా వైరస్ శరీరంలోకి చేరకుండా చేస్తుంది.
*ఈ బియ్యంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.
*నల్ల ధాన్యాలు మంచి రుచిని కూడా కలిగి ఉంటాయి. అందుకనే ఎక్కువగా తీపి వంటలు చేయాడనికి నల్ల బియ్యాన్ని ఉపయోగిస్తారు.
*ఈ బియ్యం ను మన డైట్ లో భాగంగా చేసుకోవడం వలన శరీరంలోని అనవసర కొవ్వును కరిగిస్తుంది. గుండె వ్యాధులనుంచి రక్షిస్తుంది.
*నల్లబియ్యంలో యాంటీఆక్సిడెంట్ల అధికం ఇవి ఆంథోసయనిన్ హృదయ, మెదడు సంబంధ సమస్యలను దరికి చేరనీయదు.
*బ్లాక్ రైస్ లో ఉండే ఫైబర్ జీర్ణసంబంధ సమస్యలను నివారిస్తాయి.
*అధిక రక్తపోటు ఉన్నవాళ్లకీ మంచి ప్రత్యామ్నాయరైస్ నల్ల బియ్యం
Also Read: బిపిన్ మరణిస్తే నువ్వుతున్న ఎమోజీలు..మతాన్ని వదిలేస్తూ మలయాళ దర్శకుడి సంచలన నిర్ణయం