Bipin Rawath-Ali Akbar: బిపిన్ మరణిస్తే నువ్వుతున్న ఎమోజీలు..మతాన్ని వదిలేస్తూ మలయాళ దర్శకుడి సంచలన నిర్ణయం

Bipin Rawath-Ali Akbar : ఎవరైనా ఆకస్మికంగా మరణించారని తెలిస్తే.. వెంటనే అయ్యో అని అంటారు.. శత్రువు మరణించినా వారిగురించి తప్పుగా మాట్లాడడానికి..

Bipin Rawath-Ali Akbar: బిపిన్ మరణిస్తే నువ్వుతున్న ఎమోజీలు..మతాన్ని వదిలేస్తూ మలయాళ దర్శకుడి సంచలన నిర్ణయం
Malayalam Director Ali Akba
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Dec 13, 2021 | 11:59 AM

Bipin Rawath-Ali Akbar : ఎవరైనా ఆకస్మికంగా మరణించారని తెలిస్తే.. వెంటనే అయ్యో అని అంటారు.. శత్రువు మరణించినా వారిగురించి తప్పుగా మాట్లాడడానికి ఆలోచిస్తారు. మరి ఓ తన జీవితాన్ని దేశ రక్షణ కోసం ధారబోసి.. విధులను నిర్వహిస్తూనే  దేశభక్తులు మరణిస్తే.. యావత్ దేశం కన్నీరు కార్చింది. అయితే అమరవీరుల మరణాన్ని కొందరు సెలబ్రేట్ చేసుకుంటూ.. నవ్వుతూ ఎమోజీలు పోస్టులు చేస్తూ.. సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. ముఖ్యంగా సిడిఎస్ బిపిన్ రావత్  విషాద మరణాన్ని.. కొందరు వేడుక జరుపుకున్నారు. ఈ విషయంపై ప్రముఖ మలయాళ దర్శకుడు అలీ అక్బర్ ఘాటుగా స్పందించారు.

రావత్ మరణాన్ని వేడుకగా జరుపుకున్నవారి చర్యలకు నిరసనగా తాను ఇస్లాం మతాన్ని విడిచి పెడుతున్నట్లు  అలీ అక్బర్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇక నుంచి తనకు, తన ఫ్యామిలీకి ఏ మతం లేదని.. తాము భారతీయులం మాత్రమే అని చెప్పారు. రావత్ మరణం పై కొంతమంది ఎమోజీలు పెట్టిన  చర్యలకు వ్యతిరేకంగా తాను మతాన్ని వదిలివేస్తున్నానని.. ఇక నుంచి మా కుటుంబానికి ఎటువంటి మతం లేదని చెప్పారు.  అంతేకాదు అలీ అక్బర్ పేరుని రామసింహన్ గా మార్చుకున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి తనను రామసింహన్ అని పిలవాలని పేర్కొన్నారు. తన నిర్ణయాన్ని తన భార్య కూడా అంగీకరించినట్లు చెప్పారు.

ఈ పేరు పెట్టుకోవాటానికి కూడా అక్బర్  కారణం చెప్పారు. కేరళలో 1947లో స్వాతంత్య్రం రావడానికి కొన్ని వారాలకు ముందు జరిగిన ఓ ఘటన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 1947లో ఇస్లాం నుండి హిందూ మతంలోకి మారినందుకు రామసింహన్.. అతని కుటుంబాన్ని ఇస్లాంవాదులు చంపేశారు. మలప్పురం జిల్లాలోని మలపరంబలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు అతని పేరుని తనకు పెట్టుకున్నట్లు చెప్పారు. సిడిఎస్ బిపిన్ రావత్ మరణాన్ని అపహాస్యం చేసిన వ్యక్తుల పేర్లతో కూడిన చిత్రాన్ని కూడా అక్బర్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఇది భారతీయులు చేయాల్సిన పని కాదంటూ తన నిరసన గళం వినిపించిన సంగతి తెలిసిందే..

Also Read: స్టైలిష్ డ్రెస్‌తో వింటర్‌లో హీటెక్కిస్తోన్న సమంత.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్..