AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruits Leaves: మనం తినే పండ్లు మాత్రమే కాదు.. వాటి ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి తెలుసా.. ఎలాగంటే..

శరీరంలో శక్తిని నిర్వహించడానికి పండ్లు పనిచేస్తాయి. వీటిలో ఉండే పీచు శరీర అవసరాలను తీర్చడంతోపాటు సహజసిద్ధమైన రీతిలో చక్కెరను మెయింటెయిన్ చేయడంలో సహాయపడుతుంది. ఈ విషయంలో కొత్తదనం ఏమీలేదు.

Fruits Leaves: మనం తినే పండ్లు మాత్రమే కాదు.. వాటి ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి తెలుసా.. ఎలాగంటే..
Health Benefits Of Fruit Leaves
KVD Varma
|

Updated on: Dec 12, 2021 | 9:30 PM

Share

Fruits Leaves: శరీరంలో శక్తిని నిర్వహించడానికి పండ్లు పనిచేస్తాయి. వీటిలో ఉండే పీచు శరీర అవసరాలను తీర్చడంతోపాటు సహజసిద్ధమైన రీతిలో చక్కెరను మెయింటెయిన్ చేయడంలో సహాయపడుతుంది. ఈ విషయంలో కొత్తదనం ఏమీలేదు. ఎందుకంటే, దాదాపుగా అందరికీ ఈ విషయాలు తెలుసు. అయితే, పండ్లు మాత్రమే కాదు.. వాటి ఆకులు కూడా ఆరోగ్యాన్ని.. అందాన్ని కాపాడుకోవడానికి సహజ వనరులు అనే విషయం మీకు తెలుసా? అవును మనం రెగ్యులర్ గా తినే పండ్ల ఆకులు ఏ రకంగా మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయో నిపుణులు చెప్పిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జామ ఆకులు – ఇందులో ఉండే పాలీఫెనాల్స్ కార్బోహైడ్రేట్లను నియంత్రిస్తాయి. జామ ఆకు టీ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఈ టీ డయేరియాను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.

అరటి ఆకులు – ఎండిన అరటి ఆకుల నుంచి టీ తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అరటి ఆకుల పేస్ట్‌ను అప్లై చేయడం వల్ల మొటిమలు నయమవుతాయి. వింటర్ సీజన్‌లో చుండ్రును తొలగించడానికి, దాని ఆకులను జుట్టుకు పట్టించి, అరగంట తర్వాత తల కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు పోతుంది.

బేల్ ఆకులు – వేసవి కాలంలో బేల్ సిరప్ తాగుతారు. కానీ, దాని ఆకులను ఏడాది పొడవునా ఉపయోగించవచ్చు. గుండెల్లో మంటగా ఉన్నట్లయితే, దాని ఆకులను నీటితో మెత్తగా రుబ్బుకుని, వడపోసి రోజుకు రెండు మూడు సార్లు త్రాగాలి. ఇలా చేయడం వల్ల మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.

దానిమ్మ ఆకులు – దానిమ్మ ఆకులను నమలడం వల్ల లూజ్ మోషన్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో దానిమ్మ ఆకులను ఉడికించి తాగితే ఆరోగ్యానికి మంచిది. శరీరంపై చిరు ధాన్యాలు కనిపించినట్లయితే, దానిమ్మ ఆకులను మెత్తగా రుబ్బుకుని, ఈ పేస్ట్‌లో రోజ్ వాటర్‌ను కలిపి రాస్తే దద్దుర్లు తగ్గుతాయి.

మామిడి ఆకులు – మామిడి ఆకులను ఉడకబెట్టి చల్లటి వాతావరణంలో గొంతు నొప్పి ఉన్నవారు తాగడం మంచిది. మలబద్ధకం సమస్య ఉంటే ఒక గ్లాసు నీళ్లలో మూడు నాలుగు మామిడి ఆకులను వేసి మరిగించి రాత్రంతా మూతపెట్టి ఉదయం ఈ నీటిని తాగాలి. దీంతో కడుపులో అసౌకర్యం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి: Medicine with Milk: టాబ్లెట్స్ పాలతో లేదా జ్యూస్ లతో ఎందుకు తీసుకోకూడదో తెలుసా.. కొన్ని టాబ్లెట్ రేపర్స్ పై ఎర్రని గీత ఎందుకుంటుంది? తెలుసుకోండి!

India help to Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌కు చేరిన భారత్ మెడిసిన్స్.. తాలిబన్ల ధన్యవాదాలు.. ఈ సహాయంపై వారెమన్నారంటే..