Health Tips: రోజును ఇలా ప్రారంభించండి.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి..

మనం రోజును ప్రారంభించే దానిబట్టే ఆ రోజంతా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం మనం తీసుకునే ఆహారం, డ్రింక్స్‌, వర్కవుట్లు.. మన రోజుని ప్రభావితం చేస్తాయి. అయితే ఉదయం నిద్ర లేవగానే చాలామంది

Health Tips: రోజును ఇలా ప్రారంభించండి.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి..
Follow us
Basha Shek

|

Updated on: Dec 12, 2021 | 6:49 PM

మనం రోజును ప్రారంభించే దానిబట్టే ఆ రోజంతా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం మనం తీసుకునే ఆహారం, డ్రింక్స్‌, వర్కవుట్లు.. మన రోజుని ప్రభావితం చేస్తాయి. అయితే ఉదయం నిద్ర లేవగానే చాలామంది టీలు, కాఫీల వంటి డ్రింక్స్‌ను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి ఆరోగ్యానికి హానికరం కాకపోయినా మెరుగైన జీవనశైలిని ఏర్పరచుకోవాలంటే మన ఆహారపు అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాల్సిందే. ఉదయం మనం తీసుకునే ఆహారం బట్టే మన శారీరక, మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరమేమీ లేదు. వంట గదిలో ఉన్న పదార్థాలనే తీసుకుంటే సరిపోతుంది. ఈ క్రమంలో ఓ హోమియోపతి నిపుణుడి ప్రకారం మనం రోజును ఎలాంటి ఆహార పదార్థాలతో ప్రారంభించాలో తెలుసుకుందాం రండి.

* నానబెట్టిన గింజలు, నట్స్‌తో రోజును ప్రారంభించడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విషయంలో బాదం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. * రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్షను ఉదయం పూట తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది. అంతేకాదు జట్టు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఇందులోని ఐరన్‌ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఇక విటమిన్‌- బితో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. * ఇది కాకుండా పసుపుతో రోజును ప్రారంభించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజూ ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది మన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే.. *జీర్ణశక్తి బాగుంటుంది. *మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. *రోగనిరోధక శక్తి పెరుగుతుంది. *చర్మం, జుట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. *ఇన్ఫెక్షన్ల సమస్య తగ్గుతుంది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!