AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Carrot:రంగులో ఏముంది అనుకునేరు.. ఈ బ్లాక్ క్యారెట్ మీ ఆరోగ్యానికి చేసే మ్యాజిక్ ఇదే..

శీతాకాలం వచ్చిందంటే చాలు క్యారెట్‌లకు డిమాండ్‌ పెరుగుతుంది. అయితే, మనమంతా సాధారణంగా తినే నారింజ రంగు క్యారెట్ల కంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్న నల్ల క్యారెట్‌ సాగుకు తమిళనాడు శ్రీకారం చుట్టింది. ఉత్తరాది రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ బ్లాక్‌ క్యారెట్‌లను పండించేందుకు నీలగిరి జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విత్తనాలను తెప్పించి, కున్నూర్‌లోని సిమ్స్‌ పార్కు నర్సరీలో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ సాగును ప్రారంభించారు. ఈ పంట కేవలం 90 నుంచి 100 రోజుల్లోనే (మూడు నుంచి మూడున్నర నెలల్లో) చేతికొస్తుందని అధికారులు తెలిపారు.

Black Carrot:రంగులో ఏముంది అనుకునేరు.. ఈ బ్లాక్ క్యారెట్ మీ ఆరోగ్యానికి చేసే మ్యాజిక్ ఇదే..
Black Carrot
Bhavani
|

Updated on: Nov 24, 2025 | 6:43 PM

Share

సాధారణంగా మనకు ఎక్కువగా లభించే నారింజ రంగు క్యారెట్లను పక్కనపెడితే, అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉన్న నల్ల రంగు క్యారెట్‌ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా సాగు చేసే ఈ అద్భుతమైన కూరగాయకు ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అపారం. వీటి ప్రత్యేకమైన నలుపు రంగుకు కారణమైన ఆంథోసైనిన్‌లు అనే శక్తివంతమైన సమ్మేళనం.. ఆరెంజ్ క్యారెట్‌లలో ఉండే బీటా-కెరోటిన్ కంటే 10 రెట్లు అధిక శక్తిని కలిగి ఉంటుంది. క్యాన్సర్‌తో పోరాడే గుణం నుంచి జీర్ణక్రియను మెరుగుపరిచే సామర్థ్యం వరకు.. ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఈ నల్ల రంగు క్యారెట్‌లో నిక్షిప్తమై ఉన్నాయి.

ఈ నల్ల క్యారెట్ సాగుకు ఇప్పుడు దక్షిణ భారతదేశం కూడా శ్రీకారం చుట్టింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దిల్లీ నుంచి ప్రత్యేకంగా విత్తనాలు తెప్పించి, కున్నూర్‌లోని సిమ్స్‌ పార్కు నర్సరీలో పైలట్‌ ప్రాజెక్టుగా సాగు మొదలుపెట్టారు. కేకులు, హల్వా తయారీకి ఎక్కువగా వినియోగించే ఈ పంట మూడు నుంచి మూడున్నర నెలల్లోనే చేతికి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ సూపర్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, ఎందుకంత శక్తివంతమైందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

శక్తివంతమైన ఆంథోసైనిన్‌లతో అసాధారణ ప్రయోజనాలు

బ్లాక్‌ క్యారెట్‌లకు నలుపు రంగు రావడానికి ప్రధాన కారణం అందులో పుష్కలంగా ఉండే ఆంథోసైనిన్‌లు. ఈ సమ్మేళనాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి ఆరెంజ్ క్యారెట్‌లో ఉండే బీటా-కెరోటిన్ కంటే ఎన్నో రెట్లు అధికమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తి పెంపు: ఇందులో విటమిన్‌ సి వంటి పోషకాలు అధికంగా ఉండటంతో రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది.

జీర్ణక్రియకు ఉపశమనం: బ్లాక్‌ క్యారెట్‌లో పీచు పదార్థం (ఫైబర్) అధికంగా ఉండటం వలన జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

క్యాన్సర్ నియంత్రణ: ఆంథోసైనిన్‌ల కారణంగా క్యాన్సర్ కణాల పెరుగుదల అడ్డుకుంటుందని, ముఖ్యంగా కొలన్, బ్రెస్ట్ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

గుండెకు మేలు: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఉత్తరాదిలో బహుళ వినియోగం

ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బ్లాక్‌ క్యారెట్‌లను కేకులు, హల్వా, జ్యూస్‌ తయారీకి విస్తృతంగా ఉపయోగిస్తారు. నీలగిరిలో ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, ఇక్కడి రైతులు ఈ కొత్త, లాభదాయకమైన పంటను పండించేందుకు ప్రోత్సాహం లభిస్తుంది.

Follow Us