AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండె ఆరోగ్యం కోసం సూపర్‌ డ్రింక్‌

గుండె ఆరోగ్యం కోసం సూపర్‌ డ్రింక్‌

Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Nov 24, 2025 | 6:26 PM

Share

ఆధునిక జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని సవాలు చేస్తుంది. కకావో, బీట్‌రూట్‌తో తయారైన ఈ ప్రత్యేక డ్రింక్ రక్తనాళాలను రక్షించి, నైట్రిక్ ఆక్సైడ్‌ను పెంచుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నిపుణులు దీనిని "కప్పులో వ్యాయామం"గా అభివర్ణిస్తున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది ఒక సహజ, ప్రభావవంతమైన మార్గం.

ఆధునిక జీవన విధానంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారింది. చెడు ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, ధూమపానంతో రక్తనాళాలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల రక్తపోటు పెరగడం, రక్తనాళాలు గట్టిపడటం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే, రోజూ ఓ ప్రత్యేక డ్రింక్ తాగడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కేవలం కకావో పౌడర్, బీట్‌రూట్‌తో తయారుచేసే ఈ డ్రింక్‌ రక్తనాళాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక కప్పు గోరువెచ్చని నీరు లేదా బాదం పాలలో 1 లేదా 2 టీస్పూన్ల ఆర్గానిక్ కకావో పౌడర్ కలపాలి. దీనికి 1 – 2 టీస్పూన్ల బీట్‌రూట్ పౌడర్ లేదా అర కప్పు తాజా బీట్‌రూట్ రసాన్ని యాడ్‌ చేయాలి. రుచి కోసం చిటికెడు ఉప్పు కూడా కలుపుకోవచ్చు. ఈ డ్రింక్‌ను రోజూ ఒకసారి తాగడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి. రక్తనాళాల లోపలి పొర దెబ్బతిన్నప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఆర్గానిక్ కకావో పౌడర్‌, బీట్‌రూట్‌ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని సహజంగా పెంచుతాయి. ఫలితంగా, రక్తనాళాలు వెడల్పుగా మారి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. నిపుణులు దీనిని “ఒక కప్పులో వ్యాయామం”గా పిలుస్తున్నారు. కకావో రక్తపోటును తగ్గించి, గుండెకు మేలు చేస్తుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధనలు తేల్చాయి. అలాగే, బీట్‌రూట్ రసం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే, కాఫీ తాగిన రెండు గంటల వరకు ఈ డ్రింక్ తీసుకోకూడదు. ఎందుకంటే కెఫిన్ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. నిపుణుల సూచన ప్రకారం మేం మీకు ఈ సమాచారాన్ని అందించాం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే ఈ డ్రింక్‌ తీసుకోవడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Butter Chicken: ప్రపంచ ఉత్తమ చికెన్‌ రెసిపిగా బటర్ చికెన్‌

మగ సింహం చెంప చెళ్లుమనిపించిన ఆడ సింహం.. కారణం ఇదే

నెల్లూరు ఫేమస్‌ స్వీట్‌.. తింటే వదిలిపెట్టరు

20 ఏళ్లకే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి

అంతమంది జనం మధ్య సిగ్గు లేని పని చేశాడు.. ఆ తరువాత