క్రెడిట్ కార్డులున్నాయా ?? జాగ్రత్త పడకపోతే అప్పుల్లోకే
ఈ రోజుల్లో బహుళ క్రెడిట్ కార్డులు సాధారణం, కానీ నిర్లక్ష్యం అప్పుల ఊబిలోకి నెట్టవచ్చు. అధిక వడ్డీలు, పెనాల్టీలు నివారించాలంటే జాగ్రత్త ముఖ్యం. బడ్జెట్ పాటించడం, రివార్డులను తెలివిగా ఉపయోగించడం, బిల్లులను సకాలంలో చెల్లించడం, ఆటో-డెబిట్ సెటప్ చేయడం వంటివి ఆర్థిక క్రమశిక్షణకు అవశ్యం. మీ క్రెడిట్ స్కోర్‌ను కాపాడుకోవడానికి, మోసాలను గుర్తించడానికి కార్డుల వాడకంపై నిఘా ఉంచండి.
ఈ రోజుల్లో ఒకటికి మించి క్రెడిట్ కార్డులు చాలా మంది దగ్గర ఉంటున్నాయి. అత్యవసర సమయాల్లో ఉపయోగపడతాయి..నిజమే కానీ.. వాడకంలో చిన్నపాటి నిర్లక్ష్యం ఉన్నా, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అప్పుల ఊబిలోకి కూరకుపోతాం. ముఖ్యంగా అధిక వడ్డీ రేట్లు, పెనాల్టీలు మీద పడతాయి. కార్డులు ఎక్కువున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడమూ మంచిది కాదు. మీ ఆదాయం, ఖర్చులను దృష్టిలో పెట్టుకోండి. నెలవారీ ఖర్చులకు బడ్జెట్ రూపొందించి, అంతవరకే కార్డులను ఉపయోగిస్తే బిల్లులను సమయానికి చెల్లించడం ఈజీ అవుతుంది. ప్రతి కార్డులో వచ్చే రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్‌లను అవగాహనతో ఉపయోగించాలి. రివార్డు పాయింట్ల కోసం అవసరం లేని ఖర్చులు చేయకూడదు. క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్లను చెక్ చేయాలి. అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఏదైనా కనిపిస్తే వెంటనే బ్యాంకుకు తెలియచేయాలి. క్రెడిట్ స్కోరును కూడా చేక్ చేయాలి. మీకు తెలియకుండానే మీ పేరుపై రుణాలు, కార్డులు తీసుకునే అవకాశాలున్నాయి. మోసపూరిత చర్యలపై క్రెడిట్ బ్యూరోకు సమాచారం ఇవ్వాలి. ప్రతి లావాదేవీకి మెసేజ్ వచ్చేలా అలర్ట్‌లు ఆన్ చేసి పెట్టాలి. బిల్లు చెల్లింపు తేదీని గుర్తుంచుకోవడం తప్పనిసరి. రెండు, మూడు కార్డుల బిల్లులను గుర్తుపెట్టుకోవడం కష్టమే. కాబట్టి, బ్యాంక్ ఖాతా నుంచి ఆటో-డెబిట్ సెట్ చేయండి. గడువు తేదీలోగా బిల్లు చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోరు దెబ్బతినదు. అవకాశముంది కదా అని ఎక్కువ కార్డులు తీసుకుంటే.. యన్యువల్ ఫీజు అదనపు భారం పడుతుంది. ఒక్క కార్డు బిల్లు చెల్లింపు ఆలస్యమైనా మీ రుణ చరిత్ర మొత్తానికి నష్టమొస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుండె ఆరోగ్యం కోసం సూపర్ డ్రింక్
Butter Chicken: ప్రపంచ ఉత్తమ చికెన్ రెసిపిగా బటర్ చికెన్
మగ సింహం చెంప చెళ్లుమనిపించిన ఆడ సింహం.. కారణం ఇదే
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

