Butter Chicken: ప్రపంచ ఉత్తమ చికెన్ రెసిపిగా బటర్ చికెన్
ప్రపంచ అత్యుత్తమ చికెన్ వంటకాల్లో బటర్ చికెన్‌కు 'టేస్ట్ అట్లాస్' 5వ స్థానం కల్పించింది. తందూరి చికెన్, చికెన్ టిక్కాకు కూడా చోటు దక్కింది. ఢిల్లీలోని మోతీ మహల్‌లో కుందన్ లాల్ మిగిలిపోయిన తందూరి చికెన్‌తో చేసిన ఈ ప్రయోగం నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భారతీయ వంటకాల ప్రాముఖ్యతను ఇది మరోసారి చాటి చెప్పింది.
ప్రపంచ అత్యుత్తమ చికెన్ వంటకాల్లో బటర్ చికెన్‌కు 5వ స్థానం లభించింది. ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన జాబితాలో తందూరి చికెన్, చికెన్ టిక్కాకు కూడా చోటు దక్కింది. దీంతో భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా మరోఏడాది గుర్తింపు లభించినట్లే. బటర్ చికెన్‌కు టేస్ట్ అట్లాస్ 4.5 రేటింగ్ ఇచ్చింది. అసలు ఈ వంటకం ఎలా పుట్టిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 1950లలో ఢిల్లీలోని మోతీ మహల్ రెస్టారెంట్‌లో కుందన్ లాల్ ఈ డిస్ తయారుచేసారు. ఆనాడు… మిగిలిపోయిన తందూరి చికెన్‌ను టమాటాలు, వెన్న, సుగంధ ద్రవ్యాలతో కలిపి గ్రేవీలా తయారు చేశారు. సాధారణంగా నాన్‌తో తినే బటర్ చికెన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఒక సాధారణ రెస్టారెంట్‌లో వృథాను అరికట్టడానికి చేసిన ప్రయోగం, నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకునే స్థాయికి చేరడం విశేషం. “ఈ సాధారణ వంటకం రాజుల కోసం తయారైనట్లుగా ఉందని టేస్ట్ అట్లాస్ తన కథనంలో పేర్కొంది. ఈ జాబితాలో టర్కీకి చెందిన ‘పిలిచ్ టోప్‌కాపీ’ మొదటి స్థానంలో నిలవగా, మొరాకో వంటకం ‘ఆర్ఫిస్సా’ రెండో స్థానాన్ని దక్కించుకుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘కొరియన్ ఫ్రైడ్ చికెన్’ మూడో స్థానంలో, పెరూ వంటకం ‘పోలో అ లా బ్రాసా’ నాలుగో స్థానంలో ఉన్నాయి. బటర్ చికెన్‌తో పాటు మరికొన్ని భారతీయ వంటకాలకు కూడా స్థానం లభించింది. తందూరి చికెన్ 14వ స్థానంలో, చికెన్ టిక్కా 35వ స్థానంలో, చికెన్-65 38వ స్థానంలో నిలిచాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మగ సింహం చెంప చెళ్లుమనిపించిన ఆడ సింహం.. కారణం ఇదే
నెల్లూరు ఫేమస్ స్వీట్.. తింటే వదిలిపెట్టరు
20 ఏళ్లకే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

