రోడ్డు పక్కన మోమోస్ అమ్మే వ్యక్తి.. రోజు సంపాదన ఎంతో తెలిస్తే షాకవుతారు
ఒక కంటెంట్ క్రియేటర్ చేసిన పరిశోధన ప్రకారం, బెంగళూరులోని ఓ మోమోస్ స్టాల్ యజమాని రోజుకు లక్షకు పైగా సంపాదిస్తున్నాడు. ఐదు గంటల పనిలో 950 ప్లేట్లు అమ్మి, నెలకు రూ. 31 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఇది బీకామ్ గ్రాడ్యుయేట్ కంటే చాలా ఎక్కువ అని వెల్లడైంది. చదువుతో సంబంధం లేకుండా చిన్న వ్యాపారాల్లోనూ అపారమైన ఆదాయ అవకాశాలు ఉన్నాయని ఈ వీడియో వైరల్ అయ్యింది.
సోషల్ మీడియాలో ఓ సింపుల్ ప్రశ్న.. ఇప్పుడు నెట్టింట లక్షలాది మందిని ఆలోచింపచేస్తుంది. ఒక బీకామ్ గ్రాడ్యుయేట్ సంపాదన కంటే.. రోడ్డు పక్కన మోమోస్ అమ్మే వ్యక్తి ఎక్కువ సంపాదిస్తున్నాడా అనే సరదా అంశంపై కంటెంట్ క్రియేటర్ క్యాస్సీ పరేరా ఇన్‌స్టాలో పెట్టిన ఒక వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందుకోసం అతను స్వయంగా ఐదు గంటలు స్టాల్‌లో పని చేసి సంచలన విషయాలను తెలుసుకుని..నెటిజన్లకు తెలియచేసాడు. చదువుకుని ఉద్యోగాలు చేసే వారి కంటే.. చదువు లేకుండా మోమోస్ అమ్మే వ్యక్తి.. నెలకు లక్షల్లో సంపాదిస్తున్నట్లు తెలిపాడు. బెంగళూరులో రద్దీగా ఉండే ఒక మోమోస్ వీధి దుకాణంలో క్యాస్సీ పరేరా ఒక రోజు మొత్తం పనిచేశాడు. అక్కడికి వచ్చే కస్టమర్లకు సర్వ్ చేయడం.. మోమోలను ఫ్రై చేయడం, హాట్ సూప్ అందించడం స్వయంగా చేశాడు. మొదటి గంటలోనే 118 ప్లేట్లు ఆర్డర్ రావడం చూసి క్యాస్సీ పరేరా ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఇక ఆ మోమోస్ స్టాల్.. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది. ఒక్కో ప్లేట్ మోమోస్ ధర రూ.110గా దాని యజమాని నిర్ణయించాడు. ఇలా ఒక రోజు సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు దాదాపు 950 ప్లేట్ల మోమోస్ అమ్ముడు అయ్యాయట. ప్లేట్‌కు రూ.110 చొప్పున మొత్తం 950 ప్లేట్లకు ఆదాయం లెక్కిస్తే ఆ స్టాల్ ఒక్క రోజు ఆదాయం రూ.1,04,500గా తేలింది. రోజూ అదే రకమైన మోమోస్ అమ్మకాలు కొనసాగితే.. నెలకు సుమారు రూ.31.35 లక్షల ఆదాయం వస్తుందని క్యాస్సీ పరేరా లెక్క కట్టారు. బీకామ్ గ్రాడ్యుయేట్ కంటే ఎవరైనా ఎక్కువ సంపాదిస్తారు అని ఒక నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించగా.. మరొకరు నేను ఏడాది మొత్తం సంపాదించినా ఇంత ఉండదు అంటూ ఆశ్చర్యపడ్డారు. ఆ మోమోస్ దుకాణంలో ఏదైనా ఉద్యోగం ఖాళీగా ఉందా.. అన్నా దయచేసి తమను పనిలో పెట్టుకోండి అంటూ అడగడం ప్రారంభించారు. సాంప్రదాయ డిగ్రీలు, పీజీలతో సంబంధం లేకుండా.. చిన్న వ్యాపారాల్లో కూడా భారీ ఆదాయ అవకాశాలు ఉంటాయనే అంశాన్ని ఈ వీడియో సూచిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రెడిట్ కార్డులున్నాయా ?? జాగ్రత్త పడకపోతే అప్పుల్లోకే
గుండె ఆరోగ్యం కోసం సూపర్ డ్రింక్
Butter Chicken: ప్రపంచ ఉత్తమ చికెన్ రెసిపిగా బటర్ చికెన్
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

