మగ సింహం చెంప చెళ్లుమనిపించిన ఆడ సింహం.. కారణం ఇదే
ప్రపంచంలో తల్లి ప్రేమకు సాటి లేదు. అడవిలో ఓ ఆడసింహం తన పిల్ల సింహాన్ని కొట్టిన మగ సింహంపై విరుచుకుపడింది. తన బిడ్డకు ఆపద వస్తే తల్లి ఎంతటివారినైనా ఎదురిస్తుందని ఈ ఘటన నిరూపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మాతృత్వం ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని ఈ సంఘటన చాటిచెబుతోంది.
ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది లేదు. తల్లి తన బిడ్డ కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడదు. బిడ్డకు ఏదైనా ఆపద వస్తే క్షణం ఆలోచించకుండా ఎంతటివారినైనా ఎదిరిస్తుంది. మనుషులైనా.. పశుపక్ష్యాదులైనా తల్లి ప్రేమ ఒక్కటే. అలా తన బిడ్డను బెదిరించిన మగ సింహంపై విరుచుకుపడింది ఓ ఆడసింహం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడవికి రాజు సింహం అని చెబుతారు. అడవిలోని ఏ జంతువైనా సింహానికి భయపడాల్సిందే. దూరం నుంచి దాని గర్జన వింటేనే జంతువులన్నీ పరార్. అలాంటి సింహం కూడా ఓ ఆడసింహం ముందు తలొంచాల్సి వచ్చింది. అడవిలో ఓ చోట సింహాల జంటతోపాటు, వాటి పిల్ల సింహం సేదదీరుతున్నాయి. ఆ బుజ్జి సింహం పిల్ల వచ్చి నిద్రపోతున్న తండ్రి సింహంతో ఆటలాడుతోంది. సింహం జూలుపట్టుకొని లాగుతుంది. దాని చిట్టిపాదాలతో తండ్రి సింహం ముఖాన్ని అందుకోవాలని చూసింది. కొద్దిసేపు ఈ అల్లరిచేష్టలన్నీ భరించిన తండ్రి సింహం సహనం కోల్పోయింది. ఏయ్.. ఆడింది చాలు.. నా నిద్ర చెడగొట్టకు..అవతలికి పో.. అన్నట్టుగా పిల్ల సింహాన్ని గుర్రుగా చూస్తూ..ఒక్కటిచ్చింది. పాపం చిట్టి సింహం వెళ్లి అవతల పడింది. దాని ఏడుపు విని పక్కనే నిద్రపోతున్న ఆడసింహానికి మెలకువ వచ్చింది. పరిస్థితి అర్థమైంది. పసి సింహం మీదా నీ ప్రతాపం.. ఇంకోసారి బిడ్డను కొడతావా.. అన్నట్టుగా మగ సింహం ముఖం మీద లాగిపెట్టి కొట్టింది. దెబ్బకు మగసింహం… తప్పయిపోయింది..క్షమించు అన్నట్టుగా తల కిందకేసుకుని సైలెంట్ అయిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎంతటివారైనా తల్లి ప్రేమ ముందు తలవంచాల్సిందే అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెల్లూరు ఫేమస్ స్వీట్.. తింటే వదిలిపెట్టరు
20 ఏళ్లకే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి
అంతమంది జనం మధ్య సిగ్గు లేని పని చేశాడు.. ఆ తరువాత
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

