AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక జాగారం చేయాల్సిన పనే లేదు.. పడుకున్న వెంటనే నిద్ర పట్టాలంటే ఈ ట్రిక్ ట్రై చేయండి

నిద్ర పట్టడం కొందరికి చాలా కష్టంగా ఉంటుంది. పడుకున్న తరువాత గంటల తరబడి ఏదో ఆలోచిస్తూ మంచం మీద గడిపే వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే నిద్ర త్వరగా పట్టే అవకాశం ఉంది. అద్భుతమైన ఫలితం కోసం ఇవి ప్రతి రోజు పాటించండి.

ఇక జాగారం చేయాల్సిన పనే లేదు.. పడుకున్న వెంటనే నిద్ర పట్టాలంటే ఈ ట్రిక్ ట్రై చేయండి
Sleeping
Prashanthi V
|

Updated on: May 07, 2025 | 2:19 PM

Share

ఈ పద్ధతిని పాటించడం ద్వారా శరీరం నిద్ర మూడ్‌ లోకి ప్రవేశిస్తుంది. మొదటిగా నాలుగు సెకన్లపాటు నెమ్మదిగా శ్వాసను లోపలికి తీసుకోవాలి. ఆపై ఏడు సెకన్లపాటు ఆ శ్వాసను అలా ఆపి ఉంచాలి. చివరగా ఎనిమిది సెకన్లపాటు మెల్లగా గాలిని బయటకు వదిలేయాలి. ఇలా మొత్తం 4 సార్లు చేయాలి. అప్పుడు శరీరం చాలా రిలాక్స్ అవుతుంది.

గది మసకగా ఉండేలా చూసుకోండి. ఎక్కువ వెలుతురు ఉన్న గదిలో నిద్ర పట్టడం కష్టం అవుతుంది. పడుకునే 30 నిమిషాల ముందు ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ వంటివి మానేయండి. స్క్రీన్ వెలుతురు మస్తిష్కాన్ని అలర్ట్ మోడ్‌లో ఉంచుతుంది. దాంతో నిద్ర రావడం ఆలస్యం అవుతుంది.

ముందుగా కళ్లను మూసుకుని శరీరంలోని ప్రతి భాగాన్ని మనసులో దృష్టికి తీసుకురండి. తల నుంచి వేళ్ల వరకూ ఒక్కో భాగాన్ని మెల్లగా రిలాక్స్ చేస్తున్నట్టు ఊహించండి. ఈ విధానాన్ని మానసిక బాడీ స్కాన్ అని అంటారు. ఇది మనసును ఇతర ఆలోచనల నుంచి తొలగించి నిశ్చల స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది.

ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవాలి. అలాగే ప్రతి ఉదయం ఒకే సమయంలో లేవాలి. ఈ పద్ధతిని కొన్ని రోజుల పాటు క్రమంగా పాటిస్తే శరీరం ఆ సమయంలో నిద్ర మూడ్‌ లోకి వెళ్తుంది. ఇలా చేస్తే నిద్ర త్వరగా పడుతుంది.

చాలా సార్లు మనసులోని ఆలోచనలు నిద్రను అడ్డుకుంటాయి. ఏం ఆలోచనలు మదిలో తిరుగుతున్నాయో ఒక కాగితంపై రాయండి. అలా రాసిన తర్వాత మనసు తేలిక పడుతుంది. అప్పుడే నిద్ర త్వరగా వస్తుంది.

పడుకునే ముందు ఏదైనా వెచ్చగా తాగడం కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉదాహరణకు పసుపుతో వేడి పాలు లేదా వేడి నీరు త్రాగొచ్చు. ఇవి శరీరాన్ని లోపల నుంచి తేలిక చేస్తాయి. అలాగే శరీరం నిద్రకు సిద్ధం అవుతుంది.

ఈ చిట్కాలు నిత్యం పాటిస్తే పడుకున్న కొద్ది సేపట్లోనే నిద్ర పట్టే అవకాశం పెరుగుతుంది. మన శరీరానికి మానసికంగా, శారీరకంగా రిలాక్స్ ఇచ్చినప్పుడే నిద్ర త్వరగా వస్తుంది. ఇవే కాకుండా రోజంతా నడకలు, చిన్నపాటి వ్యాయామం చేస్తూ శరీరాన్ని అలసిపోయేలా ఉంచితే నిద్ర ఇంకా బాగా వస్తుంది.