Corona third wave alert : బీ కేర్‌ఫుల్..! కరోనా కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యం చేస్తున్నారా? నిపుణులు హెచ్చరిక

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. అలా అని మనం పూర్తి సేఫ్ గా ఉన్నామా..? అంటే మాత్రం.. కాదు అనే సమాధానం వస్తుంది...

Corona third wave alert : బీ కేర్‌ఫుల్..! కరోనా కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యం చేస్తున్నారా? నిపుణులు హెచ్చరిక
Covid-19
Follow us

|

Updated on: Jul 28, 2021 | 3:25 PM

Third wave alert : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. అలా అని మనం పూర్తి సేఫ్ గా ఉన్నామా..? అంటే మాత్రం.. కాదు అనే సమాధానం వస్తుంది. కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నప్పటికీ కరోనా వైరస్ మాత్రం మనతోనే ఉంది అంటున్నారు నిపుణులు. మనం ఎంత జాగ్రతగా ఉంటే అంత మంచిదంటున్నారు. వాక్సిన్ తీసుకున్న వారైనా, కరోనా వచ్చి తగ్గిన వారైనా అందరూ జాగ్రతగా ఉండకపోతే థర్డ్ వేవ్ తప్పదంటున్నారు.

అటు, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుంది. అయినప్పటికీ మనకు ముప్పు పొంచివుందని అంటున్నారు. ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ జాగ్రతలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు.  పండగలు, జాతరలు, పెళ్లిళ్లు.. దేనిలోనైనా కరోనా జాగ్రతలు మాత్రం తప్పదంటున్నారు. మేము వాక్సిన్ తీసుకున్నాం మాస్క్ తీసేస్తా.. అంటే మరోసారి కరోనా కాటుకు గురి అవుతారంటున్నారు.

పబ్లిక్ గేదరింగ్, ఫంక్షన్స్‌కు వెళ్ళేవారు ముఖ్యంగా చాలా జాగ్రతగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం ప్రజలని చూస్తుంటే జాగ్రత్తలు మర్చిపోయి రోడ్ల పై తిరుగుతున్నారు.. దీని వల్ల వాళ్ళతో పాటు పక్క వారు ఇబ్బంది పడాల్సి వస్తుందని గుర్తుచేస్తున్నారు డాక్టర్లు.

ప్రస్తుతం తెలంగాణలో 50 శాతం మంది ఫస్ట్ డోస్, 30 శాతం మందికి సెకండ్ డోస్ వాక్సిన్ ఇచ్చామని.. అయినప్పటికీ జాగ్రత్తల విషయంలో అలసత్వం వస్తే థర్డ్ వేవ్ ముప్పు తప్పదని ఫీవర్ ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టర్ శంకర్ వెల్లడించారు.

కరోనా తగ్గే వరకు లాక్ డౌన్ పెట్టాలంటే సాధ్యం అయ్యే పని కాదు.. కేసులు తగ్గుతున్నాయి కావున రెవెన్యూ పెంచుకోవడానకి అందరికీ వెసులుబాటు ఇస్తుంది. కాబట్టి మరొక మూడు నెలలు కరోనా జాగ్రతలు పాటిస్తూ ఉంటే డిసెంబర్ నాటికి మాస్క్ లేకుండా తిరిగే చాన్స్ రావచ్చు. కనుక ఇప్పుడు జాగ్రతలు తప్పనిసరి అంటున్నారు వైద్యులు.

వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న వారందరూ వాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని.. ప్రభుత్వం వద్ద ఉన్న స్టాక్ ఆధారంగా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎలెందర్, టీవీ9 ప్రతినిధి

Read also :  Chittoor : చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో దారుణం, ఇద్దరు మైనర్ల నిర్వాకం

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్