AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor : చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో దారుణం, ఇద్దరు మైనర్ల నిర్వాకం

చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని నిలువరాతిపల్లిలో ఘోరం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న మతిస్థిమితం లేని 34 ఏళ్ల మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు ఇ..

Chittoor : చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో దారుణం, ఇద్దరు మైనర్ల నిర్వాకం
Venkata Narayana
|

Updated on: Jul 27, 2021 | 2:13 PM

Share

Chittoor : చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని నిలువరాతిపల్లిలో ఘోరం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న మతిస్థిమితం లేని 34 ఏళ్ల మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు ఇద్దరు మైనర్ యువకులు. భర్త కూలి పనుల కోసం బెంగుళూరు వెళ్లడంతో ఇంట్లో ఉన్న మతిస్థిమితం లేని మహిళను గ్రామ సమీపంలోని కుంట వద్ద కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ సదరు ఇద్దరు మైనర్లు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో.. గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు పోలీసులు. నిందితులైన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు మదనపల్లి డిఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు.

మరోవైపు, చిత్తూరు జిల్లాలో అత్యంత కర్కశానికి ఒడిగట్టాడో భూ యజమాని. అతి క్రూరంగా ఆవు కాలు నరికాడు. నోరు లేని మూగజీవి ఆకలితో మేత కోసం పొలంలోకి వెళితే అతి కిరాతకంగా కత్తితో ఆవు కాలిపై వేటు వేశాడు గాంధీ అనే వ్యక్తి. కార్వేటి నగరం మండలం డిఎంపురం గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పుత్తూరు గోసంరక్షణ శాలలో వుండే నాలుగు ఆవులు మేత కోసం డీఎంపురం గ్రామంలోని మామిడి తోటలోకి వెళ్ళడంతో పొలం యజమాని గాంధీ ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. దీంతో.. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడు గాంధీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా ఉండగా, విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెంలో కలకలం రేగింది. బావ మహాలక్శ్మినాయుడుపై హత్యాయత్నం చేశాడు బావమరిది. ఇనుపరాడ్డుతో తలపై మోదాడు. తీవ్రగాయాలపాలైన మాహాలక్ష్మినాయుడును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read also : Fish Curry : అయ్యో పాపం.. రాత్రి చేపల పులుసు తిన్నారు.. తెల్లారికి విగత జీవులయ్యారు