Banana Side Effects: ప్రతిరోజూ అరటిపండు తింటున్నారా? ఈ షాకిండ్ విషయాలు మీకోసమే..!
ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే పండ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పండ్లలో విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే పండ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పండ్లలో విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. అయితే యాపిల్ కాకుండా చాలా పోషకాలున్న పండ్లు చాలానే ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండటానికి ప్రయోజనకరమైన ఆహారం తినాలనుకుంటే.. అరటిపండు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజుకు ఒక అరటిపండు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండులో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అరటిపండులో ఉండే కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఎ, సి, బి-6, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సోడియం, పొటాషియం శరీరానికి పూర్తి పోషణను అందిస్తాయి. అదనంగా, సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. అందుకే అరటిపండును సూపర్‌ఫుడ్‌గా పేర్కొంటారు. అయితే, అరటిపండ్లను తినడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఆ నష్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అరటిపండు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు..
1. అరటిపండులో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఇవి బరువును పెంచుతాయి. అందుకే అధిక బరువు ఉన్నవారు అరటిపండ్లను తినకూడదని చెబుతారు.
2. అరటిపండులో ప్రొటీన్లు తక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి.
3. అరటిపండ్లలో ఉండే ఫ్రక్టోజ్ కడుపులో గ్యాస్ సమస్యలను కలిగిస్తుంది.
4. కిడ్నీ సమస్యలు ఉరన్నవారు అరటిపండ్లు తీసుకోవడం తగ్గించాలి. అరటిపండులో ఉండే పొటాషియం కిడ్నీలపై మరింత దుష్ప్రభావం చూపుతుంది.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు వైద్య నివేదికలు, ఆరోగ్య నిపుణుల సూచనల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..