Diabetics: డయాబెటిస్ రోగులకు చేసే గ్లూకోజ్ పరీక్షలను నొప్పిలేకుండా చేసే విధానం కనిపెట్టిన శాస్త్రవేత్తలు

Diabetics: డయాబెటిస్ రోగుల కోసం రక్తంలో గ్లూకోజ్ పరీక్ష కోసం "హోలీ గ్రెయిల్" ను అభివృద్ధి చేశారని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Diabetics: డయాబెటిస్ రోగులకు చేసే గ్లూకోజ్ పరీక్షలను నొప్పిలేకుండా చేసే విధానం కనిపెట్టిన శాస్త్రవేత్తలు
Diabetics
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: KVD Varma

Updated on: Jul 14, 2021 | 9:43 AM

Diabetics: డయాబెటిస్ రోగుల కోసం రక్తంలో గ్లూకోజ్ పరీక్ష కోసం “హోలీ గ్రెయిల్” ను అభివృద్ధి చేశారని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది లాలాజలం ద్వారా గ్లూకోజ్ స్థాయిలను తనిఖీ చేసే నాన్-ఇన్వాసివ్ స్ట్రిప్. ఇప్పటివరకూ ఈ పరీక్షలను రక్తనమూనాలు సేకరించడం ద్వారా చేస్తూవస్తున్నారు. ఈ పరీక్షా ఫలితాల కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ విధానంతో ఆ సమస్యలు ఉండవు. చిన్న స్ట్రిప్ ద్వారా లాలాజలం నుంచి గ్లూకోజ్ స్థాయిలను ఈ పద్ధతిలో సులభంగా గుర్తించవచ్చు. గ్లూకోజ్‌ను గుర్తించే ఎంజైమ్‌ను ట్రాన్సిస్టర్‌లో పొందుపరచడం ద్వారా ఈ తాజా పరీక్ష పనిచేస్తుంది. ఆ తరువాత గ్లూకోజ్ ఉనికిని ఇది చూపిస్తుందని ఆస్ట్రేలియాలోని న్యూకాజిల్ విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర ప్రొఫెసర్ పాల్ దస్తూర్ తెలిపారు. “ఈ పరీక్ష నిజంగా నొప్పి లేని, తక్కువ ఖర్చుతో కూడిన గ్లూకోజ్ పరీక్ష అవకాశాన్ని అందిస్తుంది. డయాబెటిస్ బాధితులకు మెరుగైన ఫలితాలను ఇస్తుంది” అని ఆయన చెప్పారు.

శాస్త్రవేత్తలు సౌర ఘటాలపై పనిచేస్తున్న సమయంలో ఈ కొత్త పరీక్ష విధానం అనుకోకుండా సృష్టించడం జరిగింది. క్లినికల్ ట్రయల్స్ ఆమోదింప చేసుకోవడం కోసం టెస్ట్ కిట్లను ఉత్పత్తి చేయడానికి ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి 6.3 మిలియన్ ఆస్త్రేలియన్ డాలర్ల నిధులను పొందింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని కోవిడ్-19 పరీక్ష, అలెర్జీ, హార్మోన్, క్యాన్సర్ పరీక్షలకు కూడా అన్వయింప చేసుకునేందుకు అవకాశం ఉన్నట్టు దస్తూర్ చెప్పారు.

ఈ విశ్వవిద్యాలయం ఇప్పటికే హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో కోవిడ్-19 కోసం అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పనిచేస్తోంది. అయితే, ఇది ఇతర పరీక్షలలో తీసుకువస్తున్న చిక్కులపై ప్రస్తుతం పనిచేస్తున్నారు. దీనిలో ఉపయోగిస్తున్న సెన్సార్ల సామర్ధ్యంపై శాస్త్రవేత్తలు చాలా ఉత్సుకత చూపిస్తున్నారు. “వైద్య పరికరాల గురించి, ప్రత్యేకమైన సెన్సార్ల గురించి మనం ఆలోచించే విధానాన్ని ఇది సమూలంగా మారుస్తుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే వీటిని చాలా తక్కువ ఖర్చుతో సిద్ధం చేయడానికి అవకాశం ఉంది.” అని దస్తూర్ అన్నారు.

Also Read: Beauty Tips : ముఖంపై నల్లటి మొటిమల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా..! అయితే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తొలగించుకోండి..

Hiccups Straw: వెక్కిళ్లకు చెక్ పెట్టిన యూఎస్ శాస్త్రవేత్తలు.. అతి చిన్న పరికరంతోనే సులభంగా సమస్య దూరం..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..