Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips: మీ పిల్లలు కడుపు నొప్పితో ఏడుస్తున్నారా.. ఇలా చేయండి!

ఇంట్లో పిల్లలు ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఎప్పుడు ఏది ఎటాక్ అవుతుందో చెప్పలేం. అన్ని రకాల మందులు ముందగానే జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. పిల్లలు ఏది పడితే అవి తినేస్తూంటారు. పెద్దలు చూస్తే మాత్రం మందలిస్తారు. కానీ ప్రతిసారీ వారికి కాపలా ఉండలేరు. ఇలా ఒక్కోసారి తిన్న పదర్థాల కారణంగా అరగక పోవడం, అజీర్తి, కడుపులో నొప్పి, పొట్ట పట్టేయడం ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలా పిల్లల్లో కడుపులో నొప్పి రావడం కూడా కామన్. ఇలా వచ్చినప్పుడు ఒకసారి ఇంట్లో టిప్స్..

Parenting Tips: మీ పిల్లలు కడుపు నొప్పితో ఏడుస్తున్నారా.. ఇలా చేయండి!
Parenting Tips
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 29, 2023 | 9:48 PM

ఇంట్లో పిల్లలు ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఎప్పుడు ఏది ఎటాక్ అవుతుందో చెప్పలేం. అన్ని రకాల మందులు ముందగానే జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. పిల్లలు ఏది పడితే అవి తినేస్తూంటారు. పెద్దలు చూస్తే మాత్రం మందలిస్తారు. కానీ ప్రతిసారీ వారికి కాపలా ఉండలేరు. ఇలా ఒక్కోసారి తిన్న పదర్థాల కారణంగా అరగక పోవడం, అజీర్తి, కడుపులో నొప్పి, పొట్ట పట్టేయడం ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలా పిల్లల్లో కడుపులో నొప్పి రావడం కూడా కామన్. ఇలా వచ్చినప్పుడు ఒకసారి ఇంట్లో టిప్స్ ని ట్రై చేయండి. ఇవి నొప్పిని తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తాయి. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా:

మనకు ఎప్పుడూ అవైలబుల్ గా ఉండే వాటిల్లో పుదీనా కూడా ఒకటి. పుదీనాలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండగా ఉంటాయి. అందుకే వీటిని వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పిల్లలకు కడుపులో నొప్పి వచ్చినప్పుడు.. కొద్దిగా పుదీనా ఆకులను బాగా దంచి.. గోరు వెచ్చగా ఉన్న ఓ గ్లాస్ నీటిలో కలిపి, కొద్దగా ఉప్పు కూడా వేసి పిల్లలకు పట్టించండి. ఇలా చేస్తే కొద్ది క్షణాల్లోనే పిల్లలకు కడుపులో నొప్పి మాయం అవుతుంది.

వాము:

వాము కూడా కడుపులో నొప్పిని తగ్గించడంలో బాగా పని చేస్తుంది. ఒక టీ స్పూన్ వామును.. నీటిలో మరిగించి.. పిల్లలకు పట్టించండి. పిల్లలు చేధుగా ఉంటే అస్సలు తినరు.. తాగరు.. కాబట్టి.. వాము అన్నం కూడా తయారు చేసి పిల్లలకు పెడితే.. కడుపు నొప్పి తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

అల్లం – తేనె:

అల్లం కూడా జీర్ణ క్రియకు బాగా హెల్ప్ చేస్తుంది. కొద్దిగా అల్లం రసంలో తేనె కలిపి.. ఈ మిశ్రమాన్ని పిల్లలకు పట్టిస్తే కడుపులో ఎలాంటి అసౌకర్యం ఉన్నా వెంటనే తగ్గుతుంది.

త్రిఫల చూర్ణం:

జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గించడంలో త్రిఫల చూర్ణం బాగా పని చేస్తుంది. కొద్దిగా త్రిఫల చూర్ణంలో తేనె కలిపి.. పిల్లలతో నాకించండి. దీని వల్ల కడుపులో నొప్పితో పాటు ఇక ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తగ్గుతాయి. అయితే దీన్ని ఇచ్చే ముందు ఆయుర్వేద నిపుణులను సంప్రదించడమ మేలు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్