Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ear Problem: హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారా.. అయితే ఈ టిప్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే!!

ప్రస్తుతం ఉన్న కాలంలో హెడ్ ఫోన్స్ వాడకుండా ఉన్నవారు చాలా తక్కువే అని చెప్పాలి. పాటలు వింటూ, ఫోన్ మాట్లాడుతూ హెడ్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకునే కనిపిస్తారు. అయితే ఇది ఎంత మాత్రం మంచి కాదంటూ హెచ్చరిస్తున్నారు..

Ear Problem: హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారా.. అయితే ఈ టిప్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే!!
Head Phones
Follow us
Chinni Enni

|

Updated on: Jul 24, 2023 | 6:31 PM

ప్రస్తుతం ఉన్న కాలంలో హెడ్ ఫోన్స్ వాడకుండా ఉన్నవారు చాలా తక్కువే అని చెప్పాలి. పాటలు వింటూ, ఫోన్ మాట్లాడుతూ హెడ్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకునే కనిపిస్తారు. అయితే ఇది ఎంత మాత్రం మంచి కాదంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. నిజానికి రేడియేషన్ తగ్గించడానికి ఇయర్ ఫోన్స్ వాడకం మంచిదే అయినా.. వాటిని మరీ ఎక్కువగా ఉపయోగిస్తే మాత్రం చెవిటివారిగా అవ్వడం గ్యారెంటీ అని పలు రీసెర్చ్ లు కూడా చెబుతున్నాయి.

-ఎక్కువ సేపు పాటలు వినడం, ఫోన్ మాట్లాడటం వంటి చేస్తుంటే వినికిడి సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. చెవుల్లో ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు.

-అలాగే ఇయర్ ఫోన్స్ ఇతరులతో కూడా పంచుకోకూడదు. అలా షేర్ చేసుకుంటే వాటిని శాని టైజర్ తో శుభ్రపరచుకోవడం మంచింది.

ఇవి కూడా చదవండి

-హెడ్ ఫోన్స్ తరచుగా వాడటం వల్ల వినికిడి 40 డెసిబుల్స్ నుండి 60 డెసిబుల్స్ కి తగ్గుతుంది. దీంతో దూరం నుంచి వచ్చే శబ్దాలు వినడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.

-హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఎక్కు సౌండ్ తో బయట శబ్దాలు మీకు వినబడకుండా పాటలు వింటుంటే చాలా తొందరగా వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు దీని వల్ల మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, గుండె జబ్బులు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి.

-మనసుపై కూడా చెడు ప్రభావాన్ని చూసే వీటిని ఎక్కువగా వాడకపోవడమే మంచింది. బస్సుల్లో, రైళ్లల్లో వెళ్తన్నప్పుడు టైమ్ పాస్ కావడానికి మీరు ఉపయోగించే ఈ హెడ్ ఫోన్స్ అనేక రకాల సమస్యలని తెచ్చిపెడతాయి.

కాబట్టి ఏది వాడినా పరిమితంగా వాడాలి. శ్రుతి మించితే ఇబ్బందులు తప్పవు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..