Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guava: రోజుకో జామపండు తింటే.. ఇన్ని ఉపయోగాలా!!

వర్షాకాలం.. ఈ సీజన్ లో ఎక్కువగా లభించే పండ్లు జామపండ్లు. పల్లెటూళ్లలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటికో జామచెట్టు ఉంటుంది. జామకాయ ముఖ్యంగా గుండెసంబంధిత వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. ఇటీవలకాలంలో చాలామంది ప్రధానంగా ఎదుర్కొంటున్న..

Guava: రోజుకో జామపండు తింటే.. ఇన్ని ఉపయోగాలా!!
Guava
Follow us
Chinni Enni

|

Updated on: Jul 24, 2023 | 4:49 PM

వర్షాకాలం.. ఈ సీజన్ లో ఎక్కువగా లభించే పండ్లు జామపండ్లు. పల్లెటూళ్లలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటికో జామచెట్టు ఉంటుంది. జామకాయ ముఖ్యంగా గుండెసంబంధిత వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. ఇటీవలకాలంలో చాలామంది ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు గుండెజబ్బులే. చిన్న, పెద్దల్లో వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుకు గురై చనిపోతున్నారు. అదే రోజుకొక జామకాయ తింటే.. గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

జామపండులో ఉండే ఫైబర్, పొటాషియం బ్లడ్ ప్రెషర్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేయడంలో దోహదపడుతాయి. యాంటీ బాక్టీరియల్ గుణాలు వివిధ చర్మసంబంధిత సమస్యల నుంచి కాపాడటంతో పాటు.. లోపలి నుంచి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.

అజీర్ణం, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలను జామకాయలోని ఔషధ గుణాలు నివారిస్తాయి. ఉసిరిలో కంటే జామపండులోనే విటమిన్ సీ అధికంగా లభిస్తుంది. ఇది కంటిచూపుని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు.. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ పండును తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కానీ.. పూర్తిగా పండిన జామకాయ కాకుండా.. ఓ మాదిరిగా ఉన్న కాయలనే తినడం మేలు.

ఇవి కూడా చదవండి

పీరియడ్స్ సమయంలో మహిళలకు వచ్చే మూడ్ స్వింగ్స్ ను కూడా జామకాయ కంట్రోల్ చేయడంలో దోహదపడుతుంది. పంటినొప్పి, నోటి అల్సర్ లను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి జామకాయ మంచి ఆహారం. వీటిలో కొవ్వును పెంచే గుణాలు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. డైట్ చేసేవారు ఎలాంటి అనుమానం లేకుండా జామకాయను కూడా తమ రెగ్యులర్ డైట్ లో తీసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

భూమికి దగ్గర్లో చక్కర్లు కొడుతున్న ఏలియన్స్‌..? ఇదిగో ఈ వీడియో
భూమికి దగ్గర్లో చక్కర్లు కొడుతున్న ఏలియన్స్‌..? ఇదిగో ఈ వీడియో
పీఎం మోదీ ఏసీ యోజన స్కీమ్‌.. పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ..
పీఎం మోదీ ఏసీ యోజన స్కీమ్‌.. పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ..
ప్రశాంత్‌ నీల్‌కు కొత్త తలనొప్పులు.. హోం గ్రౌండ్‌లో చిక్కులు..
ప్రశాంత్‌ నీల్‌కు కొత్త తలనొప్పులు.. హోం గ్రౌండ్‌లో చిక్కులు..
రూ.15 వేలకే అదిరే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు.. ది బెస్ట్ ఫోన్స్ ఇవే
రూ.15 వేలకే అదిరే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు.. ది బెస్ట్ ఫోన్స్ ఇవే
ఇంజెక్షన్‌ అంటే భయమా.. అయితే మీకే ఈ గుడ్‌న్యూస్‌!
ఇంజెక్షన్‌ అంటే భయమా.. అయితే మీకే ఈ గుడ్‌న్యూస్‌!
స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతుందా..? ఈ సింపుల్ చిట్కాలతో సమస్య ఫసక్.!
స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతుందా..? ఈ సింపుల్ చిట్కాలతో సమస్య ఫసక్.!
26 రూపాయలకు 28 రోజుల చెల్లుబాటు.. అద్భుతమైన జియో ప్లాన్‌
26 రూపాయలకు 28 రోజుల చెల్లుబాటు.. అద్భుతమైన జియో ప్లాన్‌
మీ స్కిన్ టోన్ అందంగా మెరవాలంటే..ఈ ఆకులతో ఫేస్‌ప్యాక్‌ ట్రైచేయండి
మీ స్కిన్ టోన్ అందంగా మెరవాలంటే..ఈ ఆకులతో ఫేస్‌ప్యాక్‌ ట్రైచేయండి
2025కి నో.. 2026పై ఫోకస్.. ఈ ఏడాది సినీ క్యాలెండర్‌ వీక్‌ కానుందా
2025కి నో.. 2026పై ఫోకస్.. ఈ ఏడాది సినీ క్యాలెండర్‌ వీక్‌ కానుందా
రేపో మాపో కుక్క చావు చస్తావు..
రేపో మాపో కుక్క చావు చస్తావు..