AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు బ్యూటీషియన్లుగా పని చేస్తున్నారా.? అయితే మీకు మూడినట్టే..! అదేంటంటే.?

ఎంతోమంది మహిళలకు కాస్మటాలజీ చదవడం, బ్యూటీషియన్లుగా కెరీర్ ప్రారంభించాలనుకోవడంపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ..

మీరు బ్యూటీషియన్లుగా పని చేస్తున్నారా.? అయితే మీకు మూడినట్టే..! అదేంటంటే.?
Beautician
S Navya Chaitanya
| Edited By: |

Updated on: Jul 24, 2023 | 5:38 PM

Share

ఎంతోమంది మహిళలకు కాస్మటాలజీ చదవడం, బ్యూటీషియన్లుగా కెరీర్ ప్రారంభించాలనుకోవడంపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ కెనడాలోని మాంట్రియల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో బ్యూటీషియన్లుగా పనిచేసే మహిళలకు అండాశయ క్యాన్సర్ ముప్పుందని తేలింది. వస్త్ర తయారీ, నిర్మాణ రంగం, సేల్స్, రిటైల్ పరిశ్రమల్లో పని చేసేవారికి కూడా ఈ ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. బ్యూటీని మరింత మెరుగుపరిచేందుకు వాడే పదార్థాలు అండాశయ క్యాన్సర్‌కు దారితీస్తాయని వెల్లడైంది.

ఎన్నో రకాల రసాయనాల తాకిడికి గురి కావడానికి, అండాశయ క్యాన్సర్ ముప్పుకు మధ్య ఉన్న సంబంధం ఈ పరిశోధనలో విశ్లేషించారు. 18-79 మధ్య ఏళ్ల, 1388 మంది మహిళలపై ఈ అధ్యయనం చేశారు. వీరిలో 491 మందికి అండాశయ క్యాన్సర్ ఉంది. పది సంవత్సరాలకు పైగా పని చేస్తున్న హెయిర్ డ్రస్సుర్లు, నిర్మాణ రంగంలో ఉన్న మహిళలు, బ్యూటీషియన్లు 13 రకాల రసాయనాలకు ఎక్కువగా గురవుతుంటారని.. అందుకని వీరికి ముప్పు మూడింతలు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

ఏయే రంగంలోని వారికి ఎంత ముప్పు ఉందో తెలుసా.?

రిటైల్ రంగంలో ఉన్నవారికి 59 శాతం ఎక్కువ, వస్త్ర పరిశ్రమలో ఎంబ్రాయిడరీ విభాగంలో దీర్ఘకాలం పాటు పనిచేసే వారికి 85 శాతం ఎక్కువ, సేల్స్ రంగంలోని వారికి 45 శాతం ఎక్కువ ముప్పు ఉండే అవకాశం ఉంది. హైడ్రోజన్ పెరాక్సైడ్, సెల్యులోజ్, ఫార్మల్డిహైడ్, టెల్కం పౌడర్, అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, ప్రొపలెంట్ గ్యాసులు, పెట్రోల్, బ్లీచ్‌లో, లభించే రసాయనాలతో 8ఏళ్లకు పైబడి పని చేస్తున్నవారికి 40 శాతం ముప్పు అధికమని తేలింది. సో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకునేవారు జర జాగ్రత్త, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Follow Us
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే
అడ్డగోలుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..
అడ్డగోలుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..
చపాతీల్లోకి చిటికెలో చేసుకునే పల్లెటూరి చేతి పచ్చడి..
చపాతీల్లోకి చిటికెలో చేసుకునే పల్లెటూరి చేతి పచ్చడి..
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.5 వేలు.. అదిరిపోయే పథకం..
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.5 వేలు.. అదిరిపోయే పథకం..
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
ఏపీ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్
ఏపీ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్