Chia Seeds: అధిక బరువును తగ్గించే అద్భుతం చియాసీడ్స్ సొంతం.. ఎలా వాడాలంటే!!
ఆధునిక జీవన శైలిలో.. నూటికి 95 శాతం మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక బరువు. దీనినే ఊబకాయం అని కూడా అంటారు. కొందరికి అతిగా తినడం వల్ల శరీరం పెరిగితే.. మరికొందరు ఏమీ తినకపోయినా బరువు పెరిగిపోతుంటారు. ఎక్కువ సమయం ఒకే ప్రదేశంలో కూర్చుని..
ఆధునిక జీవన శైలిలో.. నూటికి 95 శాతం మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక బరువు. దీనినే ఊబకాయం అని కూడా అంటారు. కొందరికి అతిగా తినడం వల్ల శరీరం పెరిగితే.. మరికొందరు ఏమీ తినకపోయినా బరువు పెరిగిపోతుంటారు. ఎక్కువ సమయం ఒకే ప్రదేశంలో కూర్చుని పనిచేయడం కూడా అధిక బరువుకి ఒక కారణమైతే.. థైరాయిడ్, మహిళలకైతే పీసీఓడీ సమస్య కారణంగానూ శరీరంలో మార్పులు జరిగి బరువు పెరుగుతుంటారు.
ఇక పెరిగిన బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అలాంటి వారందరికీ చియా సీడ్స్ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. చూడటానికి చాలా చిన్నగా, సన్నగా కనిపించే ఈ గింజల్లో అద్భుతమైన గుణాలున్నాయి. నలుపు, గోధుమ, తెలుపు రంగులో ఉండే చియా సీడ్స్.. సాల్వియా హిస్పానికా అనే మొక్క నుంచి వచ్చే ఉత్పత్తులు. వీటిని నీటిలో నానబెట్టుకుని తినొచ్చు లేదా అలాగే నానబెట్టకుండా కూడా తీసుకోవచ్చు.
వీటిలో ఫైబర్, ప్రొటీన్, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ముఖ్యంగా చియా సీడ్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పీచు పదార్థం బరువును తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా రోజుకి 10 గ్రాములు అంటే.. 3-4 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ తీసుకుంటే.. బరువు త్వరగా తగ్గొచ్చు. పొట్ట, తొడలు, నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకునేందుకు చియాసీడ్స్ తీసుకోవడంతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేయాలి.
రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల కడుపునిండిన ఫీలింగ్ ఉంటుంది. త్వరగా ఆకలి కూడా ఉండదు.. ఏ సమయంలోనైనా చియాసీడ్స్ ను తీసుకోవచ్చు. బరువును తగ్గించడంతో పాటు మలబద్ధకం సమస్యను కూడా నివారిస్తుంది. వీటిలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్, మైరిసెటిన్, క్వెర్సెటిన్, కెంప్ఫెరోల్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. హైబీపీ (రక్తపోటు), గుండెపోటు వంటి వాటివి దరి చేరకుండా ఈ చియాసీడ్స్ చక్కగా పని చేస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..