Periods Food: పీరియడ్స్ సమయంలో అలసటగా ఉంటుందా.. ఈ ఫుడ్స్ తినాల్సిందే!
మహిళలకు రుతు చక్రంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కంటిన్యూగా వస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే పలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సిందే. అయితే ఈ నెలసరి సమయం వచ్చిందంటే చాలా మంది మహిళలకు భయంగా ఉంటుంది. అందుకు కారణాలు చాలా ఉంటాయి. ఇంట్లో ఉండే మహిళల కంటే ఆఫీసులకు వెళ్లే మహిళలకు మరిన్ని ఇబ్బందులు ఉంటాయి. హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్, కడుపులో నొప్పి, వెన్ను నొప్పి, తీవ్రంగా రక్త స్రావం, పొత్తి కడుపు ఉబ్బరం, నీరసం, కళ్లు..

మహిళలకు రుతు చక్రంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కంటిన్యూగా వస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే పలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సిందే. అయితే ఈ నెలసరి సమయం వచ్చిందంటే చాలా మంది మహిళలకు భయంగా ఉంటుంది. అందుకు కారణాలు చాలా ఉంటాయి. ఇంట్లో ఉండే మహిళల కంటే ఆఫీసులకు వెళ్లే మహిళలకు మరిన్ని ఇబ్బందులు ఉంటాయి. హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్, కడుపులో నొప్పి, వెన్ను నొప్పి, తీవ్రంగా రక్త స్రావం, పొత్తి కడుపు ఉబ్బరం, నీరసం, కళ్లు తిరగడం, ఆహారం తీసుకోవాలి అనిపంచకపోవడం, కాళ్లూ, చేతులు లాగడం ఇలా పెద్ద లిస్టే ఉంటుంది.
పీరియడ్స్ సమయంలో రక్త స్రారం వలన స్త్రీలలో అలసట అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే హార్మోనలలో మార్పులు వల్ల కూడా మానసిక ఒత్తిడి, ఆందోళన కలుగుతూ ఉంటాయి. ఈ సమయంలో వెంటనే వారికి శక్తి కావాలంటే పలు రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇలా నెలసరి సమయంలో ఇబ్బందులు పడే వారు ఖచ్చితంగా పలు రకాల ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.
ఆకు కూరలు:
పీరియడ్స్ సమయంలో కూడా ఎప్పటిలాగే ఉండాలంటే.. మీరు రుతుక్రమం మొదలు అయ్యే ముందే ఆహారంలో ఖచ్చితంగా మార్పులు చేసుకోవాలి. ఆకు కూరల్ని తినడం వల్ల.. అసలట వంటివి రాకుండా చేస్తాయి. అలాగే రక్తాన్ని తిరిగి నింపే ప్రక్రియలో కూడా ఈ ఆకు కూరలు హెల్ప్ చేస్తాయి. అంతే కాకుండా శరీరానికి శక్తిని కూడా ఇస్తాయి.
అల్లం:
అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవడ వల్ల రుతు క్రమంలో వచ్చే నొప్పులు, మంటలను తగ్గిస్తుంది. అంతే కాకుండా పీరియడ్స్ సమయంలో అల్లంతో చేసిన ఆహారాలు కానీ టీ తాగినా ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. అలసటను దరి చేరనివ్వదు.
డార్క్ చాక్లెట్:
నెలసరి సమయంలో డార్క్ చాక్లెట్ తినడం వల్ల కూ అలసట అనేది దూరం అవుతుంది. అంతేకాకుండా మూడ్ ని మార్చడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సెరటోనిన్ అనే హార్మోన్ ని ఉత్పత్తి చేసి.. మానసికంగా ఉత్సాహంగా ఉంచుతుంది.
పెరుగు:
చాలా మంది నెలసరి సమయంలో పెరుగు తినకూడదు అంటారు. కానీ పెరుగులో ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అలసట దూరం అవడమే కాకుండా.. పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అలాగే జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








