AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

పులిపిర్లతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వాటిని తొలగించేందుకు అనేక రకాల ట్రీట్మెంట్‌లు తీసుకుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు అవి తగ్గవు. అయితే మన పరిసరాల్లో దొరికే వెల్లుల్లి, కలబంద, అముదం వంటివి సరైన పద్దతిలో వాడటం వల్ల ఈ పులిపిర్ల సమస్యలకు గుడ్‌బై చెప్పొచ్చు అంటున్నారు నిపుణులు. అయితే వీటిని ఎలా వాడాడే పులిపిర్లు తొలగిపోతాయో తెలుసుకుందాం పందండి.

పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!
Representative Image
Ravi Kiran
|

Updated on: Jun 09, 2025 | 10:47 PM

Share

ఫ్రెండ్స్, బంధువుల, ఇలా మన చుట్టు పక్కన ఉండే వారిలో చాలా మంది పులిపిర్లతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇకి కొందరి మొహం, మెడ, చేతులపై ఉండడంతో వారు చాలా చికాకుగా ఫీల్ అవుతూ ఉంటారు. వాటిని తొగించేందుకు ప్రయత్నించి గాయాలు చేసుకుంటుంటారు. దీంతో పాటు రకరకాలు టీట్మెంట్‌లు తీసుకుంటారు. అయినా కూడా కొన్ని సందర్భాల్లో అవి తగ్గవు అయితే మన పరిసరాల్లో దొరికే కొన్ని వస్తువులతో పులిపిర్ల సమస్యకు చెక్‌ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. వెల్లుల్లి, కలబంద, ఆముదం వంటి వాటిని సరైన పద్దతిలో వాడటం ద్వారా పులిపిర్ల సమస్యకు మనం చెక్‌ పెట్టవచ్చు.

వెల్లుల్లితో ఈ పులిపిర్ల సమస్యకు మనం చెక్‌ పెట్టవచ్చు. ఎలా అంటే మొదటగా వెల్లుల్లిని మెత్తగా దంచి దాన్ని పులిపిర్లు ఉన్న ప్రాంతంలో పెట్టి బ్యాండేజ్ వేయాలి. ఈ ప్రక్రియను రాత్రి పడుకునే ముందు చేయాలి. ఉదయం లేచి బ్యాండేజ్‌ను తీసేస్తే పులిపిర్లు రాలిపోతాయట. వెల్లుల్లి యాంటీ వైరస్‌ గుణాలను కలిగి ఉండడంతో పాటు దానిలో ఆలియం స‌టివం అనే స‌మ్మేళ‌నం ఉంటుంది ఇది పులిపిర్లు రాలిపోవడానికి సహకరిస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కలబంద ద్వారా కూడా ఈ పులిపిర్లను మనం తొలగించవచ్చు. కలబంద గుజ్జును తీసి పులిపిరి ఉన్న ప్రాంతంలో పెట్టి పైన చెప్పిన విదంగానే బ్యాండేజ్ వేయాలి. ఉదయం లేచి బ్యాండేజ్‌ను తీసేయాలి. ఇలా చేయడం వళ్ల కూడా పులిపిర్లు తొలగిపోతాయి. ఇదే కాకుండా ఈ కలబంద గుజ్జు మన చర్మాన్ని రక్షించడంలో కూడా మంచి ఔషదంగా పనిచేస్తుంది. దీన్ని మొహానికి రాసుకొని కొద్ది సేపు తర్వాత గొరు వెచ్చని నీటితో కడుక్కుంటే మొహంపై ఉన్న చర్య సమస్యలు తొలగిపోతాయి అని నిపుణులు చెబుతున్నారు. ఇదే కాకుండా ఆముదంతో కూడా పులిపిర్లను తొలగించవచ్చట. ఆముదాన్ని పులిపిరి ఉన్న ప్రాంతంలో రాసుకోవడం వల్ల వాటిని తగ్గించుకోవచ్చట. అయితే ఇవి తగ్గడానికి కొందరికి వారం, మరికొందరికి అంతకన్నా ఎక్కువ రోజులు కూడా పట్టే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.